Thammudu Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో నితిన్ (Nithin)… ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలబడే ప్రయత్నం అయితే చేసుకుంటున్నాడు… ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయని నితిన్ కేవలం తెలుగు సినిమాలను మాత్రమే చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమా భారీ డిజాస్టర్లను మూటగట్టుకుంటున్న నేపథ్యంలో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమ్ముడు (Thammudu) సినిమా సైతం మొదటి షో తోనే నెగెటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు…నిజానికి తమ్ముడు సినిమాలో పెద్దగా కథ అయితే ఏమీ లేదు. అక్క మాట కోసం తమ్ముడు నిలబడి పోరాటం చేయడం తప్ప ఇందులో ఏమీ లేదు. సినిమాలో చూపించిన ఎమోషన్స్ ను సైతం సరిగ్గా వర్కౌట్ అయితే చేయలేదు. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా హై ఎలివేషన్స్ ఇచ్చే విధంగా ఉండకపోవడంతో ఈ సినిమాని చూస్తున్న ప్రేక్షకులందరు చాలావరకు డిసపాయింట్ అవుతున్నారనే చెప్పాలి… అసలు ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటి అంటే సినిమాలో ఒక్కటి కూడా రిపీటెడ్ గా చూసే సీన్ లేకపోవడం ఒకటైతే, కొద్దిపాటి ఎమోషన్స్ ఉన్నప్పటికీ వాటిని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయలేకపోయారు… ఇక ఫస్టాఫ్ లో ఈ సినిమాలో కొన్ని ఎలివేషన్స్ ఇచ్చే సీక్వెన్స్ ఉన్నప్పటికీ వాటిని కూడా నార్మల్ గా ప్రజెంట్ చేశారు…
Also Read: ‘వార్ 2’ కి 5 భాషల్లో డబ్బింగ్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్..మరి హృతిక్ రోషన్ పరిస్థితి ఏంటి?
ఒక కథని థ్రిల్లింగా చెప్పాలి అనుకున్నప్పుడు అందులో హై ఎలివేషన్స్, ఎమోషన్స్ ని పెట్టీ కొన్నిసార్లు వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలి. సినిమాలో ఎక్కడ అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఎంతసేపు ముందుకు సాగుతున్నట్టుగానే ఉంది… ఇక సెకండాఫ్ లో ఒక వంతెన మీద యాక్షన్స్ సీక్వెన్స్ అయితే మరి దారుణంగా ఉంటుంది…
మొత్తానికైతే ఈ సినిమా ఫస్టాఫ్ లోనే గాడి తప్పింది. ఇక సెకండ్ హాఫ్ లో ట్రైబల్ ఏరియాలో నివసిస్తున్న ఉల్లాల్లో ఉన్న జనాలు నితిన్ వాళ్ల గ్యాంగ్ ని పట్టుకొని చంపితే వాళ్లకు కోటి రూపాయలు ఇస్తామని విలన్ చెప్పడంతో వాళ్ళు మందలు మందలుగా హీరో మీదికి రావడం…హీరోతో ఫైటింగ్ సీక్వెన్స్ లను చేయడం ఇదంతా ప్రేక్షకుడికి విపరీతంగా బోర్ కొట్టింది. ఇక విలన్ 20 డిజిబుల్స్ కి మించి సౌండ్స్ ను వినలేకపోవడం అనేది కొత్తగా ట్రై చేసినప్పటికి సరైన క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఇంకా దాన్ని స్ట్రాంగ్ గా ఎలివేట్ చేయలేకపోయారు. క్లైమాక్స్లో విలన్ ను చంపడం అనేది సరైనదైతే కాదు.
Also Read: బ్రహ్మముడి రుద్రాణి గ్లామర్ లుక్ చూశారా? వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న లేడీ విలన్
వాడు చేసిన తప్పు పనికి వాడికి శిక్ష పడాలి. అలా కాకుండా ఏదో సౌండింగ్ ఎక్కువగా పెంచేసి వారిని చంపేసినట్టుగా క్రియేట్ చేశారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రతి సీన్ నాసిరకంగా ఉండడం,ఇక ప్రేక్షకులను ఏమాత్రం ఎంగేజ్ చేయకపోవడంతో ఈ సినిమా సగటు ఆడియన్స్ కి నచ్చలేకపోయింది…