megastar-chiranjeevi
Megastar Chiranjeevi: నాలుగు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు చిరంజీవి. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్టార్ హీరో అయ్యారు. నెంబర్ వన్ హీరోగా తిరుగులేని రికార్డులు నెలకొల్పాడు. సామాజిక స్ఫూర్తి కలిగిన చిరంజీవి.. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఏర్పాటు చేశారు. చిరంజీవి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఇటీవల పద్మవిభూషణ్ ప్రకటించింది. గతంలో పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులకు ఎంపికైన చిరంజీవిని తాజాగా పద్మ విభూషణ్ వరించింది.
కెరీర్లో చిరంజీవి అనేక సత్కారాలు, సన్మానాలు అందుకున్నారు. గౌరవ డాక్టరేట్స్ పొందారు. తాజాగా ఆయన బ్రిటన్ పౌరసత్వం పొందారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తుంది. బ్రిటన్ ప్రభుత్వం గౌరవార్థం చిరంజీవికి సిటిజెన్షిప్ ఇచ్చి సత్కరించింది అనేది ఆ వార్తల సారాంశం. ఈ కథనాలపై చిరంజీవి టీం స్పందించారు. చిరంజీవికి బ్రిటన్ గవర్నమెంట్ పౌరసత్వం ఇచ్చిందన్న వార్తల్లో నిజం లేదని వారు స్పష్టత ఇచ్చారు. ఇలాంటి కథనాలు రాసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని, స్పష్టత తీసుకోవాలని ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఈ మూవీ విడుదల ఆలస్యమైంది. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం అనుకోని కారణాలతో సమ్మర్ కి వాయిదా పడింది. విశ్వంభర సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో తెరకెక్కుతుంది. త్రిష ప్రధాన హీరోయిన్ గా నటిస్తుంది. ఈషా చావ్లా, సురభి వంటి యంగ్ హీరోయిన్స్ సైతం భాగమయ్యారు. ఆ మధ్య విడుదలైన టీజర్ ఆకట్టుకుంది.
విశ్వంభర సెట్స్ పై ఉండగానే ఇద్దరు దర్శకులతో చిరంజీవి చిత్రాలు ప్రకటించారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తో ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తి రేపింది. మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ గా ఇది తెరకెక్కనుంది. అలాగే దర్శకుడు అనిల్ రావిపూడితో ఒక చిత్రానికి కమిట్ అయ్యారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి-చిరంజీవి కాంబోలో చిత్రం అనగానే అంచనాలు పీక్స్ కి చేరాయి. అనిల్ రావిపూడి మార్క్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుంది. 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు. చిరంజీవి డ్యూయల్ రోల్ చేసే అవకాశం కలదట.
Also Read: సుకుమార్ రామ్ చరణ్ కోసం ఫ్యామిలీ స్టొరీ ని రెడీ చేస్తున్నారా..?