Nikhil Siddhartha: ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో ఎదిగిన అతి కొద్ది నటుల్లో హ్యాపీడేస్ ఫేమ్ నిఖిల్ సిద్ధార్థ ఒకరు. హ్యాపీడేస్ చిత్రంతో పరిచయమైన నటుల్లో నిఖిల్ నిలదొక్కుకున్నారు. కార్తికేయ సినిమాతో ఫ్యాన్ ఇండియా స్టార్ గా నిలిచారు. ఇంతవరకు ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి గానీ.. ఆయన కులం గురించి గానీ ఎక్కడా ప్రస్తావన లేదు. కానీ ఉన్నట్టుండి కులాన్ని తెలుగుదేశం పార్టీ హైలెట్ చేసింది. సోషల్ మీడియాలో ట్రోల్ కి కారణం అయ్యింది.
హీరో నిఖిల్ సిద్ధార్థ తెలుగుదేశం పార్టీలో చేరారు. లోకేష్ సమక్షంలో టిడిపి కండువా కప్పుకున్నారు. ఆయన సమీప బంధువు మాల కొండయ్య యాదవ్ కు చీరాల టికెట్ లభించింది. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ తో పాటు విద్యాసంస్థల అధినేత. ఆయన కుమారుడికి నిఖిల్ సోదరికి ఇచ్చి వివాహం చేశారు. ఈసారి చీరాల టిక్కెట్ను మాల కొండయ్య యాదవ్ కు కేటాయించడంతో కృతజ్ఞతగా లోకేష్ ను నిఖిల్ కలిసారు. టిక్కెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.అయితే లోకేష్ పార్టీ కండువా వేయడం,నిఖిల్ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిపోయింది.
అయితే ఇక్కడే ఒక ట్విస్ట్. ఇలా నిఖిల్ టిడిపిలో చేరిన మరుక్షణం పార్టీ అధికారిక ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది. అందులో నిఖిల్ కుల ప్రస్తావన చేశారు. ఇప్పటివరకు ఆయన నిఖిల్ గానే సుపరిచితం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత.. నిఖిల్ సిద్ధార్థ యాదవ్ అంటూ అందులో ప్రస్తావించారు. అయితే హీరో నిఖిల్ కులాన్ని ప్రస్తావించడం దేనికి అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రత్యేకించి హీరో నిఖిల్ యాదవ కులానికి చెందిన వ్యక్తి అని అందరికీ అర్థమయ్యేలా టిడిపి ట్విట్ చేసింది. యాదవ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా తెలుస్తోంది. కానీ ఈ ప్రయత్నం బెడిసి కొట్టింది. ఆ హీరో కుల ప్రస్తావన ఎందుకంటూ పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అటు నిఖిల్ అభిమానులు సైతం టిడిపి అతి ప్రవర్తనను తప్పుపడుతున్నారు. లేనిపోని రాజకీయాలు ఆపాదించవద్దని కోరుతున్నారు.
తెలుగుదేశం పార్టీ లో చేరిన హీరో నిఖిల్ సిద్ధార్థ యాదవ్. పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.#TeluguDesamParty #NaraLokesh pic.twitter.com/fQ5Lt5x1Jh
— Telugu Desam Party (@JaiTDP) March 29, 2024