Ariyana Glory : అరియనా గ్లోరీ ఒకప్పుడు సన్నగా నాజూగ్గా ఉండేది. ఆమె అందానికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఫిదా అయ్యాడు. జిమ్ ఫిట్ లో అరియనాను ఇంటర్వ్యూ చేశాడు. అరియనా అంగాంగ వర్ణన చేశాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది.
స్లిమ్ అండ్ ఫిట్ గా ఉండే అరియనా ఈ మధ్య బరువు పెరిగింది. ఆమె బొద్దుగా తయారయ్యారు. దీన్ని ఆమె ఫ్యాన్స్ జీర్ణించుకోలేకున్నారు. మీరు ఇంకా బరువు పెరగొద్దు. బాగోరని కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ నెగిటివ్ కామెంట్స్ పై అరియనా గ్లోరీ స్పందించడం విశేషం. సన్నగా ఉన్నా సమస్యే, లావుగా ఉన్నా సమస్యే. అయినా నేను ఎలా ఉంటే మీకెందుకు? పనిలేదా మీకు? నేను ఎలా ఉన్నానో కామెంట్స్ చేయడం మానేసి మీ పనులు మీరు చూసుకోండని వీడియో పోస్ట్ చేసింది .
తాజాగా అరియనా శారీలో ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది. సదరు ఫోటోల్లో అరియనా మరింత లావుగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో నెటిజెన్స్ ఇంకా లావయ్యావని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అరియనా చీర కట్టి తప్పు చేసింది అనే మాట వినిపిస్తోంది.
కాగా అరియనా గ్లోరీ బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి వెళ్ళింది. ముక్కుసూటిగా గేమ్ ఆడుతూ అభిమానులను సంపాదించుకుంది. ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యింది. హౌస్లో అరియనా ఎలాంటి ఎఫైర్స్ పెట్టుకోలేదు.
బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా అభిజిత్ నిలిచాడు. అరియనాకు నాలుగో స్థానం దక్కింది. కాగా బిగ్ బాస్ సీజన్ 7లో అరియనా కంటెస్టెంట్ అమర్ దీప్ ని సపోర్ట్ చేసింది. అమర్ దీప్ కి ఓటేయాలని క్యాంపైన్ చేసింది. అమర్ దీప్ యాంటీ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు.
అయినా అభిజీత్ కి సపోర్ట్ చేయడం మానలేదు. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. నిజమైన విన్నర్ మాత్రం అమర్ దీప్ అంటూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ని ఆమె రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. అరియనా గ్లోరీ ప్రస్తుతం సోషల్ మీడియాకే పరిమితం అవుతుంది. బుల్లితెర మీద కూడా ఆమె సందడి తగ్గింది.