AP Rain Alert: బంగాళాఖాతంలో( Bay of Bengal) తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పలుచోట్ల భారీ వర్షాలు కురిసాయి. గుంటూరు తో పాటు ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలో మాత్రం కుండపోత గా వర్షం పడింది. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం కొనసాగుతోంది. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండనుంది. దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
* ఈరోజు వర్షం పడే జిల్లాలు..
ఈరోజు ప్రకాశం( Prakasam ), నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు వర్ష సూచన ఉంది. కొన్నిచోట్ల పిడుగులు కూడా పడనున్నాయి. అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. చెట్లతోపాటు పెద్ద పెద్ద టవర్లు, శిధిల భవనాల వద్ద ఉండొద్దని చెబుతోంది.
* రికార్డు స్థాయిలో వర్షం..
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల రికార్డు స్థాయిలో వర్షపాతం( rainfall) నమోదు అయ్యింది. తిరుపతి జిల్లా మల్లం లో అత్యధిక వర్షపాతం నమోదయింది. 70 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాకినాడ జిల్లా ఇంజరంలో 58 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లా కోటలో 52.7, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 52.2, ఎర్రగొండపాలెం లో 49.7, చిత్తూరు జిల్లా దామోదర మహారాజపురంలో 49, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈతకోటలో 47 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
* నెలాఖరు వరకు వానలు
మరోవైపు నైరుతి రుతుపవనాలు దేశం నుంచి నిష్క్రమించాయి. అయినా కానీ ఈ నెలాఖరు వరకు వరుసగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖరీఫ్ లో కీలకంగా వ్యవహరిస్తుంది సెప్టెంబర్. ఈ నెలలో వర్షాలు పడితే మాత్రం పంటలు గట్టెక్కుతాయి. ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశానికి తాకాయి. వారం రోజులు ముందుగానే కేరళ తీరానికి తాకి శరవేగంగా విస్తరించాయి. అయితే జూన్, జూలైలో వర్షపాతం లోటు కనిపించింది. ఆగస్టు, సెప్టెంబర్ లో ఆశాజనకంగా వర్షాలు పడ్డాయి. దేశవ్యాప్తంగా సాగుకు అవసరమైన సాగునీరు అందించడంలో నైరుతి రుతుపవనాలు కీలకంగా వ్యవహరిస్తాయి. అటువంటిది ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడ్డాయి. దీంతో పంటలు సైతం ఆశాజనకంగా ఉన్నాయి.