Heavy Rain Alert: ఈ వేసవి తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తోంది. ఏప్రిల్ రెండో వారం నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం చాలా జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. ఇక మే ప్రారంభం కావడంతో 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే రెండో వారంలో మొదలయ్యే హీట్‌వేవ్ సాధారణం కన్నా 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఈసారి ఏప్రిల్ 14 నుంచి 14 రోజులపాటు నమోదైన ఉష్ణోగ్రతలు చారిత్రక రికార్డు. మే మొదటి వారంలో 47ని వరకు రావచ్చని ఐఎండీ అంచనా వేసింది. వడగాడ్పులు వీస్తాయని తెలిపింది.
ముందస్తుగా రుతుపవణాలు..
ఈ క్రమంలో ఐఎండీ చల్లటి కబురు కూడా చెప్పింది. ఈసారి రుతుపవనాలు ముందస్తుగా వస్తాయని వెల్లడించింది. మే 14 లేదా 15వ తేదీన అండమాన్‌లోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. సాధారణం కన్నా 5 నుంచి 7 రోజులు ముందగా వస్తాయని అంచనా వేసింది. ఇక ఈసీజన్‌లో దేశవ్యాప్తంగా 105–110 శాతంఒ సగటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ–పశ్చిమ భారతంలో ఎక్కువగా కురుస్తాయని ఈశాన్య భారతంలో తక్కువగా కురుస్తాయని తెలిపింది.
ముందస్తు ప్రభావాలు..
ఈసారి అధిక ఉష్ణోత్రల కారణంగా మొక్కలు చనిపోవడం, పశువుల మరణాలు పెరిగాయని తెలిపింది. 20 నుంచి 30 శాతం పంటలు ఎండిపోయాయని అంచనా వేసింది. అయితే ఈసారి మాన్సూన్ ముందుగా రావడం పంటలకు లాభమని తెలిపింది. అయితే అధిక వర్షాలు వరదలు కూడా పంటలను దెబ్బతీస్తాయని వెల్లడించింది.
ఎల్‌నినో, హిందూ మహాసముద్రంలో ఓషాన్ డిపోల్ ప్రభావంతో వేడి తీవ్రత ఎక్కువగా ఉందని ఐఎండీ తెలిపింది. మాన్సూన్ ముందుగా రావడం (2020లా) ఉపశమనం ఇస్తుందని పేర్కొంది. కానీ అసమాన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రమాదాలు పెంచుతాయని అంచనా వేసింది.