spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Heavy Rain Alert: హీటెక్కిన తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. ఈసారి ముందుగానే..

Heavy Rain Alert: హీటెక్కిన తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. ఈసారి ముందుగానే..

Heavy Rain Alert: ఈ వేసవి తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తోంది. ఏప్రిల్‌ రెండో వారం నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం చాలా జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. ఇక మే ప్రారంభం కావడంతో 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే రెండో వారంలో మొదలయ్యే హీట్‌వేవ్‌ సాధారణం కన్నా 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ వరకు అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఈసారి ఏప్రిల్‌ 14 నుంచి 14 రోజులపాటు నమోదైన ఉష్ణోగ్రతలు చారిత్రక రికార్డు. మే మొదటి వారంలో 47ని వరకు రావచ్చని ఐఎండీ అంచనా వేసింది. వడగాడ్పులు వీస్తాయని తెలిపింది.

ముందస్తుగా రుతుపవణాలు..
ఈ క్రమంలో ఐఎండీ చల్లటి కబురు కూడా చెప్పింది. ఈసారి రుతుపవనాలు ముందస్తుగా వస్తాయని వెల్లడించింది. మే 14 లేదా 15వ తేదీన అండమాన్‌లోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. సాధారణం కన్నా 5 నుంచి 7 రోజులు ముందగా వస్తాయని అంచనా వేసింది. ఇక ఈసీజన్‌లో దేశవ్యాప్తంగా 105–110 శాతంఒ సగటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ–పశ్చిమ భారతంలో ఎక్కువగా కురుస్తాయని ఈశాన్య భారతంలో తక్కువగా కురుస్తాయని తెలిపింది.

ముందస్తు ప్రభావాలు..
ఈసారి అధిక ఉష్ణోత్రల కారణంగా మొక్కలు చనిపోవడం, పశువుల మరణాలు పెరిగాయని తెలిపింది. 20 నుంచి 30 శాతం పంటలు ఎండిపోయాయని అంచనా వేసింది. అయితే ఈసారి మాన్సూన్‌ ముందుగా రావడం పంటలకు లాభమని తెలిపింది. అయితే అధిక వర్షాలు వరదలు కూడా పంటలను దెబ్బతీస్తాయని వెల్లడించింది.

ఎల్‌నినో, హిందూ మహాసముద్రంలో ఓషాన్‌ డిపోల్‌ ప్రభావంతో వేడి తీవ్రత ఎక్కువగా ఉందని ఐఎండీ తెలిపింది. మాన్సూన్‌ ముందుగా రావడం (2020లా) ఉపశమనం ఇస్తుందని పేర్కొంది. కానీ అసమాన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రమాదాలు పెంచుతాయని అంచనా వేసింది.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Oktelugu Epaper