HomeతెలంగాణKavitha Political Statement Controversy: రాష్ట్ర సేనా.. రక్షణ సేనా.. కవిత తొలి అడుగే తప్పటడుగు!

Kavitha Political Statement Controversy: రాష్ట్ర సేనా.. రక్షణ సేనా.. కవిత తొలి అడుగే తప్పటడుగు!

Kavitha Political Statement Controversy: తెలంగాణలో ఏప్రిల్‌ 25న కొత్త పార్టీ పుట్టింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, మాజీ ఎంపీ–ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటించారు. దాదాపు రెండు దశాబ్దాలు తెలంగాణ జాగృతి పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా పనిచేశారు. కానీ ఇటీవల బీఆర్‌ఎస్‌లో మారిన పరిణామాలతో కవిత సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. దీంతో పార్టీ ఆమెను సస్పెండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి బయటకు […]

Kavitha Political Statement Controversy: తెలంగాణలో ఏప్రిల్‌ 25న కొత్త పార్టీ పుట్టింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, మాజీ ఎంపీ–ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటించారు. దాదాపు రెండు దశాబ్దాలు తెలంగాణ జాగృతి పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా పనిచేశారు. కానీ ఇటీవల బీఆర్‌ఎస్‌లో మారిన పరిణామాలతో కవిత సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. దీంతో పార్టీ ఆమెను సస్పెండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఏడాది తర్వాత సొంత పార్టీ పెట్టారు. హైదరాబాద్‌లో పార్టీ పేరు ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా ప్రకటించారు. సపోర్టర్లు, యువకులతో సంబురాలు చేశారు. టీఆర్‌ఎస్‌ వచ్చేలా పార్టీ పేరు ప్రకటించారు. కానీ మూడు రోజుల్లో (ఏప్రిల్‌ 28) తారుమారైంది.

ఈసీ ట్విస్ట్‌..
ఎన్నికల సంఘం (ఈసీ) ’తెలంగాణ రక్షణ సేన’ పేరుకు ఏప్రిల్‌ 28న ఆమోదం తెలిపింది. కవిత టీమ్‌ దరఖాస్తు చేసిన ‘రాష్ట్ర సేన’ ఈసీ ఆప్షన్లలో లేనే లేదు. ఈసీ తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి పేర్లు మాత్రమే ఉన్నాయి. ఏ పేరుకు దరఖాస్తు చేశారో కూడా తెలియకుండానే కవిత పార్టీ పేరు ప్రకటించారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈసీ గుర్తించిన తెలంగాణ రక్షణ సేన పేరు కూడా ఫైనల్‌ కాదు. 30 రోజుల్లో పార్టీ పేరుపై ఎవరూ అభ్యంతరం తెలుపకపోతేనే ఈసీ ఫైనల్‌ చేస్తుంది. అయితే బీఆర్‌ఎస్‌ నేతలు టీఆర్‌ఎస్‌పై అభ్యతరం చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే టీఆర్‌ఎస్‌ గతంలో తమ పార్టీ పేరు అని ఇప్పటికే గులాబీ నేతలు చెబుతున్నారు.

వ్యూహాత్మక తప్పిందం..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ అధికార వైఫల్యాలు (ఎన్నికల ఓటమి, కుటుంబ రాజకీయాలు) తర్వాత కవిత విడిపోయారు. డెవలప్‌మెంట్‌ లీడర్‌షిప్‌) ఇమేజ్‌తో యువత–మహిళల సపోర్ట్‌ బేస్‌తో తెలంగాణ రాష్ట్ర సేనగా పార్టీ పేరు పెట్టారు. కానీ ప్లానింగ్‌ లోపం మొదటి ఇమేజ్‌కు దెబ్బ తీసింది. ఈసీ నియమాలు తెలుసుకోకుండా, దరఖాస్తుపై స్పష్టత లేకపోవడం కవిత వ్యూహాత్మక తప్పిదం. కాంగ్రెస్‌–బీజేపీ డామినేషన్‌ మధ్య తమ పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని కవిత భావిస్తున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో కవిత ’సేన’ శక్తివంతమవుతుందా? లేక పేరు మార్పు మరో ఆలస్యానికి దారి తీస్తుందా? అనే సందిగ్ధం నెలకొంది. ప్లానింగ్‌ లేకుండా ప్రకటన గందరగోళానికి దారితీసింది. దీంతో కవిత తొలి అడుగే తప్పటడుగు వేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper