Homeలైఫ్ స్టైల్Microwave Oven Usage Tips: మైక్రో వేవ్ వాడుతున్నారా.. ఈ సమాచారం మీకోసమే..

Microwave Oven Usage Tips: మైక్రో వేవ్ వాడుతున్నారా.. ఈ సమాచారం మీకోసమే..

Microwave Oven Usage Tips: ఒకప్పుడు సంప్రదాయ వంటలు మాత్రమే తినేవారు. కాలం మారింది. వెస్ట్రన్ కల్చర్ మన ఇంట్లోకే కాదు.. వంటింట్లోకి కూడా వచ్చేసింది.. వెస్ట్రన్ దేశాలలో లభించే వంటకాలు మనవాళ్లు కూడా చేసుకోవడం మొదలుపెట్టారు. వెస్ట్రన్ దేశాలలో వంటకాలు వండే సమయంలో వారు రకరకాల పద్ధతులు అనుసరిస్తారు.. రకరకాల పరికరాలను వాడతారు. వెస్ట్రన్ దేశాలలో వంటకాలలో ప్రధానమైనవి బర్గర్, శాండ్ విచ్, పిజ్జా, పాస్తా.. వీటి తయారీకి కచ్చితంగా మైక్రోవేవ్ ఉండాల్సిందే. ఎందుకంటే ఒక […]

Microwave Oven Usage Tips: ఒకప్పుడు సంప్రదాయ వంటలు మాత్రమే తినేవారు. కాలం మారింది. వెస్ట్రన్ కల్చర్ మన ఇంట్లోకే కాదు.. వంటింట్లోకి కూడా వచ్చేసింది.. వెస్ట్రన్ దేశాలలో లభించే వంటకాలు మనవాళ్లు కూడా చేసుకోవడం మొదలుపెట్టారు. వెస్ట్రన్ దేశాలలో వంటకాలు వండే సమయంలో వారు రకరకాల పద్ధతులు అనుసరిస్తారు.. రకరకాల పరికరాలను వాడతారు.

వెస్ట్రన్ దేశాలలో వంటకాలలో ప్రధానమైనవి బర్గర్, శాండ్ విచ్, పిజ్జా, పాస్తా.. వీటి తయారీకి కచ్చితంగా మైక్రోవేవ్ ఉండాల్సిందే. ఎందుకంటే ఒక నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఇవి తయారవుతాయి. ఉష్ణోగ్రత పెరిగినా, తగ్గినా ఈ వంటకాలు అంత నాణ్యంగా ఉండవు. రుచి కూడా ఉండవు. కొంతమేర తయారు చేసిన తర్వాత.. మిగతా భాగం మొత్తం మైక్రోవేవ్లో ఉడికిస్తుంటారు. మైక్రోవేవ్ లు వెస్ట్రన్ దేశాలలో ప్రతి ఇంట్లో ఉంటాయి.

మన దగ్గర కూడా వెస్ట్రన్ వంటకాలు తయారు చేయడం పెరిగింది కాబట్టి.. మైక్రోవేవ్ లు ప్రతి ఇంట్లోనూ ఉంటున్నాయి. మైక్రో వేవ్ వాడితే క్యాన్సర్ వస్తుందని అనుకునే వారు. కానీ, అది నిజం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు..ఇందులో ఉన్న నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ఆహారాన్ని వేటి మాత్రమే చేస్తుంది. అది డీఎన్ఏ ను ఏమాత్రం దెబ్బతియ్యదు. సాధారణ గ్రిల్లింగ్, ఫ్రైయింగ్ కంటే మైక్రోవేవ్ ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. మైక్రోవేవ్ ఉపయోగించేటప్పుడు అందులో ప్లాస్టిక్ డబ్బాలను వాడకూడదని వైద్యులు చెప్తున్నారు. వాటిని వాడితే ఆ కెమికల్స్ ఆహారంలో చేరుతాయట. మైక్రోవేవ్ సేఫ్ గా ఉపయోగించాలంటే కచ్చితంగా గాజు లేదా పింగాణి పాత్రలను మాత్రమే వాడాల్సి ఉంటుంది.

కొంతమంది ఇనుప పాత్రలను కూడా వాడతారు. ముఖ్యంగా ఎగ్ పఫ్ వంటివి తయారు చేస్తున్నప్పుడు ఇనుప పాత్రలను మైక్రోవేవ్ లో పెడతారు. ఆ విధానం సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు. గాజులేదా పింగాణి పాత్ర మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. అలా అయితేనే ఆరోగ్యం బాగుంటుందని.. హానికర పదార్థాలు ఆహారంలో చేరవని సూచిస్తున్నారు. వెస్ట్రన్ ఫుడ్ తయారు చేయడం అలవాటు ఉన్నవారు.. కచ్చితంగా నిబంధనలు పాటించాలని.. తేలికగా ఉన్నాయని ప్లాస్టిక్ పాత్రలను వాడితే.. ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.. ముఖ్యంగా వెస్ట్రన్ ఫుడ్ కు అలవాటు పడకపోవడం మంచిదని చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper