Nara Lekesh : ఏపీ రాజకీయాలు( AP politics) ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఇకనుంచి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటన చేశారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక వ్యూహం తెలియక రాజకీయ పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. అయితే ఇది వైసీపీకి అత్యంత ఆందోళన కలిగించే అంశం. అయితే ఆ పార్టీ సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు. అటు టిడిపి సైతం భిన్నంగా స్పందిస్తోంది. ఇటువంటి తరుణంలో మరో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు స్థానంలో మరొకరు ముఖ్యమంత్రి పదవి చేపడతారని దీని సారాంశం. మరి కొద్ది నెలల్లో ఈ మార్పు అనివార్యం అంటూ విశ్లేషకులు సైతం తమ ఖచ్చితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో ఒక కుదుపు ఖాయం.
* ఏడు నెలల పాలన పూర్తి
ఏపీలో మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం( Alliance government ) నడుస్తోంది. సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఏకైక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. అయితే ఇటీవల లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ టిడిపి శ్రేణుల నుంచి వినిపిస్తోంది. అన్ని విధాల ప్రూవ్ చేసుకున్న లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాల్సిందేనని టిడిపి నేతలు కోరుతున్నారు. అయితే అది ఎలా సాధ్యమని.. ఏకైక డిప్యూటీ సీఎం గా పవన్ ఉంటేనే గౌరవం అని.. చంద్రబాబు మరో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన తమకు అభ్యంతరం లేదని జనసేన నుంచి వినిపిస్తోంది మాట. అయితే చంద్రబాబు యాక్టివ్ గా ఉన్న సమయంలోనే లోకేష్ ను ప్రమోట్ చేయాలన్నది టిడిపి నుంచి వినిపిస్తున్న మాట. దీంతో ఇది రెండు పార్టీల మధ్య సీరియస్ అంశంగా మారిపోయింది. దీంతో ఇరు పార్టీల నాయకత్వాలు తమ పార్టీల శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశాయి. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడవద్దని ఆదేశించాయి.
* ఇదే వార్త హల్చల్
అంతా సైలెంట్ గా మారుతున్న క్రమంలో.. ఇప్పుడు తాజాగా మరో వార్త హైలెట్ అవుతోంది. త్వరలో చంద్రబాబు స్థానంలో నారా లోకేష్ ( Nara Lokesh )ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారన్నది ఆ వార్త సారాంశం. దీంతో ఇది ఎలా సాధ్యమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. లోకేష్ ను డిప్యూటీ సీఎం గా కూడా జనసేన ఒప్పుకోలేదు. అటువంటిది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా ఒప్పుకుంటుంది అన్నది అందరి మదిలో మదిలే అనుమానం. అయితే ఇక్కడే ఒక కీలక మలుపు. ఈ ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరికొద్ది నెలల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ప్రమాణం చేయడం ఖాయమని సమాచారం.
* పవన్ కు ఎనలేని గౌరవం
అయితే తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) ఘన విజయం సాధించింది ఈ ఎన్నికల్లో. 135 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది. 21 అసెంబ్లీ సీట్లతో సంపూర్ణ విజయం సాధించింది జనసేన. అయితే తమకంటే తక్కువ స్థానాలు అయినా.. పవన్ కళ్యాణ్ కు ఎనలేని గౌరవం లభిస్తుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సైతం సంతృప్తిగా ఉన్నారట. అయితే రాష్ట్రంలో బలమైన పార్టీగా.. బలమైన నెట్వర్క్ ఉన్న పార్టీగా టిడిపి ఉంది. దానిని గౌరవించి లోకేష్ ను సీఎం చేయాలన్న ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ ను గౌరవించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు కాన్వెన్స్ చేశారని.. భవిష్యత్తు ప్రతిపాదనలు పెట్టారని.. అందుకు సంతృప్తి వ్యక్తం చేస్తూ పవన్ సైతం ఓకే చెప్పారన్నది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం.
* పవన్ కన్వెన్స్ చేస్తారని..
తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని జన సేనలో( janasena ) ఒక వర్గం కోరింది. కానీ పవన్ వినలేదు. తన నిర్ణయాన్ని గౌరవించిన వారే తనవారని.. గౌరవించకపోతే వెళ్లిపోవచ్చని అప్పట్లోనే తేల్చి చెప్పారు. టిడిపి తో పొత్తు పెట్టుకున్నారు. 60 నుంచి 70 సీట్లు పొత్తులో భాగంగా అడగాలని పార్టీ నుంచి ఒక డిమాండ్ వచ్చింది. అయినా సరే పవన్ తన బలాన్ని అంచనా వేసుకుని 21 సీట్లకే ఓకే చెప్పారు. అప్పుడు కూడా పార్టీ శ్రేణులకు కన్విన్స్ చేశారు. మంత్రి పదవులు సైతం ఎక్కువగా తీసుకోవాలని జనసేన నుంచి డిమాండ్ వచ్చింది. కానీ మిత్ర ధర్మ ప్రకారం ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు.. ఒక మంత్రి పదవి ఫార్ములాను అనుసరించి మూడు పదవులను తీసుకున్నారు. అప్పుడు కూడా పార్టీ శ్రేణులకు కన్విన్స్ చేశారు. పార్టీ నుంచి ఎటువంటి డిమాండ్ వచ్చినా.. టిడిపి పై పార్టీ శ్రేణులు విమర్శలు చేసినా కంట్రోల్ చేస్తూ వచ్చారు పవన్.. ఇప్పుడు లోకేష్ విషయంలో కూడా అలానే కన్వన్స్ చేస్తారని తెలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎదుట ఎప్పుడో ప్రతిపాదన పెట్టారని.. అందుకు ఆయన అంగీకారం తెలిపారు అన్నది తాజా ప్రచారం. ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.