Amazon River: ఈ భూమి మీద మానవ మనుగడకు నీటి అవసరం చాలా ఉంది. భూమికి మూడు వైపులా నీరు ఉండి.. ఒకవైపు భూభాగం ఉన్నా.. అనేక మార్గాల ద్వారా నీటి సరఫరా అవుతుంది. ఈ నీరు నదుల ద్వారా ప్రవహించి.. సముద్రంలో కలుస్తుంది. నదుల ద్వారా ప్రవహించిన నీరునే ప్రజలకు ఉపయోగపడుతుంది. అయితే ప్రపంచంలోనే అతి పొడవైన నది ఒకటి మొత్తం తొమ్మిది దేశాల గుండా ప్రవహిస్తుంది. అంతేకాకుండా గ్రామాలు పట్టణాల్లో ఇది వెళ్లినా.. 9 దేశాల్లో ప్రవహించినా.. ఈ నదిపై ఒక్క వంతెన కూడా నిర్మించలేదు. దీనిపై ఒక్క వంతెన లేకున్నా వ్యాపార వ్యవహారాలు మాత్రం సాఫీగా సాగుతూ ఉంటాయి. ఇంతకీ ఆ నది ఏది ఆ నది పొడవెంత? ఈ నదిపై వంతెనను ఎందుకు నిర్మించలేదు..?
ప్రపంచంలో అత్యంత పొడవైన.. భయంకరమైన నదిగా ఆమెజాన్ ను పేర్కొంటారు. ఇది దీని పొడవు 6,400 కిలోమీటర్లు. ఈ నది మొత్తం తొమ్మిది దేశాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. అవి బ్రెజిల్, బొలీవియా, పెరూ, ఈక్వేడార్, కొలంబియా, వెనిజులా, గయానా, ఫ్రెంచ్ గయానా, సూరి నామ్ దేశాల్లో కనిపిస్తుంది. చెరువులోని అండీస్ పర్వతాలలో ప్రారంభమైన అమెజాన్ నది అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది.
ఈ నది గుండా ఉన్న ప్రాంతాల ద్వారా అనేకమంది దీనిపై వ్యాపారాలు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇది 11 కిలోమీటర్ల కంటే ఎక్కువగా వెడల్పు గా ఉంటుంది. దీంతో ఎక్కడా దీనిపై వంతెన నిర్మించే సాహసం ఎవరు చేయలేదు. ఈ నది వెడల్పు ఎక్కువగా ఉండటంతో పాటు ప్రపంచంలోనే పేరుగాంచిన అమెజాన్ అడవి గుండా ప్రవహిస్తుంది. అందువల్ల జీవ వార్య పర్యావరణానికి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి దీనిపై ఎక్కడ వంతెనను నిర్మించలేదు. అంతేకాకుండా దీనిపై వంతెన నిర్మించినా అది ఎక్కువ కాలం ఉండదని కొందరు ఇంజనీర్లు ప్రకటించారు. మరోవైపు దీనిపై వంతెన నిర్మిస్తే అధికంగా ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.
అమెజాన్ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ వరదను తట్టుకోవడానికి గాని లేదా అవసరమైన ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి గానీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరోవైపు ఈ నది కొంత భాగం మాత్రమే జనవాసాల నుంచి వెళుతుంది. కానీ ఇక్కడ కూడా ఇలాంటి వంతెనను నిర్మించలేదు. అయినా ఈ నదిపై రవాణా ఇతర ముఖ్యమైన పనులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ నదిపై స్టీమర్లు పడవల ద్వారా ప్రయాణించి వర్తకం చేస్తున్నారు…
సాధారణంగా ఏ నదిపై అయినా ఒక్క వంతెన అయినా ఉంటుంది. కానీ ఇంత పొడవు ఉన్న అమెజాన్ నదిపై ఒక్క వంతెన కూడా లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దక్షిణ అమెరికా మధ్యలో ప్రవహించే ఈ నది దట్టమైన చెట్ల మధ్య ప్రవహిస్తోంది. దీంతో ఈ నదిని పైన నుంచి చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. మరోవైపు కొందరు పర్యాటకులు ఈ నదిపై వెళ్లడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు.