MLC Elections: నల్గొండ,వరంగల్,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలామంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ప్రకారం 25,877 మంది ఓటర్లు సరిగ్గా తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరంతా సీరియల్ నెంబర్ ప్రకారం బ్యాలెట్ పేపర్ పై నంబర్ ను ఆయా అభ్యర్థులకు అనుగుణంగా వేయ్యలేకపోయారని తెలిపింది. తద్వారా భారీ ఎత్తున ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు చెల్లకుండా పోయాయని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
వరంగల్,ఖమ్మం,నల్లగొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సెగ్మెంట్ లో మొత్తం 4,06,300 ఓట్లు ఉన్నాయి. ఇందులో 3,36, 013 ఓట్లు పోలయ్యాయి. అయితే ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 25,877 ఓట్లు చెల్లకుండా పోయాయి. కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యతగా 1,22,813 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. ఇక బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి..43,313 ఓట్లు పోలయ్యాయి. అయితే ఇందులో తీన్మార్ మల్లన్నకు పోలైన ఓట్ల నుంచే ఎక్కువ ఓట్లు ఇన్ వ్యాలీడ్ గా ఉన్నట్లు ప్రిసైడింగ్ అధికారులు ప్రకటించారు.
అయితే ఈ స్థాయిలో చెల్లని ఓట్లు ఫస్ట్ ప్రయారిటీలో పోలవడంతో.. ఎన్నికల అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గెలుపుకు చాలా దగ్గరలో ఉన్న తీన్మార్ మల్లన్న విషయంలో పట్టభద్రులు సరిగా ఓటు వేయలేకపోవడం పలువురుని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. వాస్తవానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే అంశంపై అటు ఆయా పార్టీల అభ్యర్థులు..ఇటు ఎలక్షన్ కమిషన్ బాగానే శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాయి. ప్రాధాన్యత క్రమంలో నంబరింగ్ ఇవ్వడం విషయంలో చాలా తర్ఫీదును ఇచ్చింది. అనేక చోట్ల సమావేశంలో ఏర్పాటు చేసి పట్టభద్రులకు ఓటింగ్ విషయంలో అవగాహనను కల్పించింది. అయితే ఇన్ని రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినప్పటికిని.. డిగ్రీ పాసైన గ్రాడ్యుయేట్స్..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడంలో చాలా మంది ఫెయిల్ అయ్యారు.