CM Revanth Reddy: రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి.. జర హామీలు అమలు చేయి సారూ

గురువారంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ ను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నుంచి పరిపాలనపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. రోజు సచివాలయానికి వెళ్లి పెండింగ్లో ఉన్న ప్రతి ఫైలును పరిశీలించాలని ఆయన భావిస్తున్నారు.

Written By: Neelambaram, Updated On : June 7, 2024 11:18 am

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: లోక్సభ ఎన్నికలు అయిపోయాయి. నిన్నటితో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ ను కూడా ఎత్తేసింది. ఇన్నాళ్లు ఎన్నికల ప్రవర్తన నియమావళి అడ్డుగా ఉన్నందునే పరిపాలనపై దృష్టి పెట్టలేకపోయామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలోనే ఆయన కూడా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఇంటికే పరిమితమయ్యారు. పరిపాలపరంగా ఏమైనా కీలక విషయాలపై అధికారులతో మాట్లాడాలన్న..అక్కడి నుంచే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పత్తి విత్తనాలు కొరత,వరదలు, ధాన్యం కొనుగోళ్లు,ఇతరత్రా అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంటి నుంచే అధికారులతో రివ్యూ మీటింగ్స్ నిర్వహించారు. ఎన్నికల నిబంధనల అడ్డు కారణంగా కొత్తగా ఏ పథకాన్ని.. ఏదైనా పని కోసం బడ్జెట్ ను రిలీజ్ చేయలేకపోయారు. ఇటు విపక్షాలు,రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెద్దగా కార్నర్ చేయలేదు.

ఇక గురువారంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ ను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నుంచి పరిపాలనపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. రోజు సచివాలయానికి వెళ్లి పెండింగ్లో ఉన్న ప్రతి ఫైలును పరిశీలించాలని ఆయన భావిస్తున్నారు. అధికారులతో వరుసగా సమీక్ష, సమావేశాలు నిర్వహిస్తూ..కాంగ్రెస్ గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన కొన్ని హామీలే ఇప్పటి వరకు అమలు అయ్యాయి. ఇంకా చాలా వరకు హామీలు అమలు కాలేదు. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆరు హామీలను ఇచ్చింది. ఒక్కో హామీ కింద మరికొన్ని ప్రామిసెస్ ను చేసింది. మహాలక్ష్మి, రైతు భరోసా,గృహజ్యోతి,ఇందిరమ్మ ఇండ్లు,యువ వికాసం,చేయూత వంటి హామీలను ఇచ్చింది.

అయితే వీటిలో కేవలం మూడు హామీలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయగలిగింది. అందులోనూ ప్రతి హామీలోని కొన్ని అంశాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేసింది. అయితే మొన్నటివరకు ఎన్నికలు ఉండడంతో..విపక్షాలు,ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. కానీ,ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. ఈ నేపథ్యంలోనే విపక్షాలు,పబ్లిక్ కాంగ్రెస్ హామీలపై ప్రశ్నించే అవకాశాలున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి కూడా ఇక ఎన్నికల్లో ఇచ్చిన మెజారిటీ హామీల అమలు కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎలక్షన్ కోడ్ కూడా ఎత్తివేయడంతో..మొదటగా ఏక మొత్తంలో రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన గతంలోనే తన విధానాన్ని ప్రకటించారు. రుణాల మాఫీ కోసం కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా క్రాప్ లోన్స్ ను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ వ్యవహారం అంత తేలికైన అంశమేమీ కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో రుణమాఫీ అంశంపై రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.

దీంతోపాటు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు విషయంలో కూడా ఆయనపై ప్రెషర్ ఉంది. మహాలక్ష్మి పథకం కింద ప్రతీ పేదింటి మహిళకు 2,500 ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అలాగే రైతులు,కౌలు రైతులకు ఎకరానికి 15 వేలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు,వరి పంటకు ప్రతీ క్వింటాల్ కు అదనంగా 500 బోనస్,ఇల్లు లేని పేదలకు 5 లక్షల ఆర్థిక సాయం,ఇంటి స్థలం, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల జాగా,విద్యార్థులకు విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల వడ్డీ రహిత రుణం,4 వేలకు పింఛన్ల పెంపు వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. ఇప్పుడు వీటిపైనే పబ్లిక్ దృష్టి కూడా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రతిపక్షాలు, ప్రజలు కూడా ఒత్తిడి చేసే అవకాశాలకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను ఎలా నేరవేర్చుతుందనేది ఆసక్తికరంగా మారంది.