CM Chandrababu: ఏపీలో( Andhra Pradesh) గ్రామ వార్డు సచివాలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయాలపై కీలక నిర్ణయం ఉంటుందని ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే సమూల ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా దీనిపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. సచివాలయాలకు సంబంధించిన శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల క్రమబద్ధీకరణ పూర్తిస్థాయిలో జరగనుందన్నమాట. గ్రామ/ వార్డు సచివాలయాలను ఏ, బి, సి క్యాటగిరిగా విభజించనున్నారు. మల్టీ పర్పస్, టెక్నికల్, అస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజన చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
* క్యాటగిరి ఏకు సంబంధించి.. 2500 వరకు జనాభా ఉన్న సచివాలయాలను చేర్చారు.
* క్యాటగిరి బికి సంబంధించి.. 2501 నుంచి 3,500 వరకు జనాభా ఉన్న సచివాలయాలను కేటగిరి పరిధిలో చేర్చారు. ఇందులో కనీసం ఏడు గ్రామ / వార్డు సచివాలయాలు ఉంటాయి.
* కేటగిరి సి కి సంబంధించి 3,500 మించి జనాభా ఉన్న సచివాలయాలను వాటి పరిధిలో చేర్చుతారు. ఇందులో కనీసం 8 గ్రామ / వార్డు సచివాలయాలు ఉంటాయి.
* పనితీరు సరికొత్తగా
సచివాలయ ఉద్యోగుల( Secretariat employees) సర్దుబాటులో భాగంగానే ఈ క్రమబద్ధీకరణకు ప్రభుత్వం దిగినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ అండ్ అదర్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, మిషన్ లెర్నింగ్, ఇతర డీప్ టెక్నాలజీల ద్వారా ఇకపై సచివాలయాలు పనిచేయాల్సి ఉంటుంది. ఆయా సాంకేతిక రంగాల్లో పరిజ్ఞానం, అర్హత ఉన్న ఉద్యోగి మాత్రమే సచివాలయంలో అందుబాటులో ఉంటారు. క్రమబద్ధీకరణ తరువాత మిగులు ఉద్యోగులు ఉంటే వారిని ఫీల్డ్ ఆఫీసర్లుగా నియమిస్తారు. ఇతర ప్రభుత్వ విభాగాల్లో సైతం సర్దుబాటు చేస్తారు. ఇప్పటివరకు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శిగా ఉన్న పంచాయితీ కార్యదర్శి
… ఇకనుంచి సచివాలయాల అధిపతిగా వ్యవహరిస్తారు. వాటిని పర్యవేక్షించడానికి మూడంచెల విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం.
* ఆ అభ్యంతరాలతోనే
అయితే ఇప్పటివరకు సచివాలయ వ్యవస్థ పనితీరుపై అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం( allians government ) ఈ క్రమబద్ధీకరణ నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా సచివాలయాలను స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ లిటరసీ, ఏఐ అడాప్షన్, ఎం ఎస్ ఎం ఈ దరఖాస్తుల స్వీకరణ, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఉపాధి అవకాశాల కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే జగన్ మానస పుత్రికగా ఉన్న సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులను తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం.