Homeఆంధ్రప్రదేశ్‌Janasena: ఆ ప్రమాదం నుంచి బయటపడిన జనసేన

Janasena: ఆ ప్రమాదం నుంచి బయటపడిన జనసేన

Janasena: ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జనసేనకు బిగ్ రిలీఫ్. ఆ పార్టీ గుర్తు విషయంలో జరుగుతున్న వివాదానికి ఈరోజు కోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. జనసేనకే గాజు గ్లాస్ గుర్తును ఖరారు చేసింది. జనసేన గాజు గ్లాస్ గుర్తును ఎలక్షన్ కమిషన్ ఫ్రీ జాబితాలో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే జనసేన ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ఈసీ తిరిగి గాజు గ్లాస్ గుర్తును జనసేనకు కేటాయించింది. అయితే జనసేన కంటే ముందుగా తాము దరఖాస్తు చేసుకున్నామని.. తమకు కాకుండా జనసేనకు కేటాయించడం ఏమిటని.. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గాజు గ్లాసు గుర్తు జనసేనదేనని తేల్చి చెప్పింది.రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటీషన్ ను రద్దు చేసింది.

ఆది నుంచి జనసేన గాజు గ్లాస్ గుర్తుపై వివాదం నడుస్తూనే ఉంది. 2014లో జనసేన ఆవిర్భవించింది. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కేంద్రంలో బిజెపికి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించింది. ఈ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అటు తరువాత ఎలక్షన్ కమిషన్ నుంచి జనసేన గాజు గ్లాస్ గుర్తును పొందింది. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ స్థానాలకు జనసేన పోటీ చేసింది. కానీ ఒక్క అసెంబ్లీ సీటుకు పరిమితం అయ్యింది. దీంతో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జనసేనకు ఓట్లు రాకపోవడంతో.. ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. అయితే జనసేన ప్రత్యేక విన్నపం మేరకు ఎలక్షన్ కమిషన్ తిరిగి గాజు గ్లాస్ గుర్తును జనసేనకు కేటాయించింది. అయితే జనసేన కంటే ముందుగా తామే దరఖాస్తు చేసుకున్నామని.. కానీ తమకు కాకుండా జనసేనకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు విచారణను ప్రారంభించింది. అయితే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ కంటే ముందుగానే జనసేన దరఖాస్తు చేసుకుందని ఈసీ చెప్పడం, అందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు సమర్పించడంతో కోర్టు.. ఈ పిటీషన్ ను రద్దు చేసింది. గాజు గ్లాసు గుర్తును జనసేనకు కొనసాగేలా ఆదేశాలు ఇచ్చింది.

ఏపీలో నాలుగు వారాల్లో ఎన్నికలు జరగనున్నాయి. జనసేన అభ్యర్థులు 21 చోట్ల పోటీ చేయనున్నారు. మరో రెండు పార్లమెంట్ స్థానాల్లో సైతం జనసేన అభ్యర్థులు బరిలో దిగనున్నారు. ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కోర్టు తీర్పు జనసేనకు అనుకూలంగా రావడం విశేషం. అయితే గత ఎన్నికల నుంచి గాజు గ్లాస్ గుర్తు అనేక రకాల వివాదాలను ఎదుర్కొంటోంది. అచ్చం గాజు గ్లాస్ గుర్తుకు దగ్గరగా ఉండే బకెట్, ఇతరత్రా గుర్తులతో చిన్నాచితకా పార్టీలు పోటీ చేస్తున్నాయి. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో సైతం జనసేన ఎనిమిది చోట్ల పోటీ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా జనసేన గుర్తుకు దగ్గరగా ఉండే.. గుర్తులతో కొంతమంది పోటీ చేశారు. జనసేన పార్టీకి దారుణంగా దెబ్బతీశారు. అయితే ఏపీలో ఏకంగా జనసేన గాజు గ్లాస్ గుర్తు తమకు కేటాయించాలని కోరడం సంచలనం రేపింది. అయితే ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాస్ ను తమకే కేటాయించాలని.. జనసేన ముందుగా అభ్యర్థించడం కలిసి వచ్చింది. లేకుంటే జనసేన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉండేది. మొత్తానికైతే కుట్రలు ఛేదించి రిలీఫ్ పొందడంతో జనసైనికుల్లో జోష్ నెలకొంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper