https://oktelugu.com/

Free Electricity: ఏపీలో ఉచిత విద్యుత్.. ఉత్తర్వులు జారీ!

Free Electricity కొద్ది రోజుల కిందట జరిగిన మంత్రివర్గ సమావేశంలో( Cabinet meeting) చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు.

Written By: , Updated On : March 27, 2025 / 09:12 AM IST
Free Electricity

Free Electricity

Follow us on

Free Electricity: ఏపీలో కూటమి ప్రభుత్వం( Alliance government ) దూకుడు మీద ఉంది. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవల విషయంలో వరుసగా నిర్ణయాలు ప్రకటిస్తోంది. ఇప్పటికే చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను తాజాగా విడుదల చేసింది. చేనేత మగ్గాలు ఉన్న ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, మరమగాలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 93 వేల చేనేత మగ్గాలు, పదివేల మర మగ్గాలు ఉన్న చేనేత కార్మికులకు ఈ నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది. దీంతో ఆయా వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: పాస్టర్ ది హత్యా? ప్రమాదమా? ఏపీ ప్రభుత్వం సీరియస్!

* ఇటీవల క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం
కొద్ది రోజుల కిందట జరిగిన మంత్రివర్గ సమావేశంలో( Cabinet meeting) చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు. చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్లు వరకు ప్రతి నెల ఉచిత కరెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. చేనేత రంగానికి ప్రోత్సాహం అందించాలని ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్ అమలుకు నిర్ణయించింది. ఆ ప్రకారం చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించనున్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు వెల్లడయ్యాయి.

* లబ్ధిదారుల గుర్తింపు
ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడంతో జిల్లాల యంత్రాంగాలు కసరత్తు ప్రారంభించాయి. జిల్లాల వారీగా లబ్ధిదారులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చేనేతల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది చేనేత కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు ఏపీ ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి చేనేత కార్మికులు చేరడం విశేషం.

* సోలార్ విద్యుత్
మరోవైపు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్( free current) బదులు.. సౌర విద్యుత్ అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. పీఎం సూర్య ఘర్ పథకం కింద సోలార్ విద్యుత్ అందించే ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక దృష్టితో ఉంది. మొత్తానికి అయితే ఏపీలో విద్యుత్ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేక తరగతుల వారికి ఉచితంగా విద్యుత్ అందించి ఉదారంగా ఆదుకుంటోంది.

 

Also Read: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తీరని విషాదం!