https://oktelugu.com/

NTR and Nelson : ఎన్టీయార్ – నెల్సన్ కాంబోలో సినిమా ఫిక్స్ అయిందా..? క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్…

NTR and Nelson : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు ఎన్టీఆర్...

Written By: , Updated On : March 27, 2025 / 09:21 AM IST
NTR , Nelson

NTR , Nelson

Follow us on

NTR and Nelson : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు ఎన్టీఆర్… ప్రస్తుతం ఆయన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఆయన తన తదుపరి సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే దేవర 2 (Devara 2) సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాల తర్వాత ఆయన తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన నెల్సన్ (Nelsan) డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే ఎన్టీయార్ కి నెల్సన్ కథ చెప్పాడని తొందర్లోనే అది ఫైనల్ అవ్వబోతుంది అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.

Also Read : ఆ ఒక్క విషయంలో ఎన్టీఆర్ పై అసంతృప్తితో ఉన్న అభిమానులు!

ఎన్టీఆర్ తను ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని పాన్ ఇండియాలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతల గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి అతను అనుకున్నట్టుగానే భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తాడా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ప్రస్తుతానికైతే తన తోటి హీరోలు భారీ విజయాలను సాధిస్తూ వాళ్ళ మార్కెట్ ని అంతకంతకు పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటికీ 500 కోట్ల మార్కెట్ దగ్గరే ఆగిపోయాడు. తన మార్కెట్ ను విస్తృతంగా పెంచుకోవాలి అంటే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాతో భారీ విక్టరీని సాధించాలి. ఇక వరుసగా 7 విజయాలను సాధించినప్పటికి అందులో ఏ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ ని అందుకోకపోవడం వల్ల ఆయనకు కొంతవరకు మైనస్ గా మారింది.

మరి ఇప్పటికైనా ఆయన భారీ విజయాలను సాధిస్తూ తన కంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక దేవర సినిమా ను రేపు జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీయార్ జపాన్ లో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు…

Also Read : ఎన్టీఆర్ కంటే అత్యధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న ‘జైలర్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ..ఇది అన్యాయం!