Homeఆంధ్రప్రదేశ్‌Visakhapatnam: రూ.20 లక్షలు నొక్కేసి.. బాధితులను బెదిరించి.. కి‘లేడీ’ సీఐ!

Visakhapatnam: రూ.20 లక్షలు నొక్కేసి.. బాధితులను బెదిరించి.. కి‘లేడీ’ సీఐ!

Visakhapatnam: ఖాకీలు కర్కశకుల్లా మారుతున్నారు.. రక్షించాల్సిన పోలీసులే భక్షించేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిందిపోయి.. వేధించుకుతింటున్నారు. బాధితులనే మరింత బాధపెడుతున్నారు. తాజాగా విశాఖలో ఓ కి‘లేడీ’ పోలీస్‌ అధికారి విశాఖలో రూ.2 వేల నోట్ల మార్పిడి నేపథ్యంలో భారీ మొత్తంలో ఆ నోట్లను తీసుకున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ గుర్తించారు. ఈ ఘటన పోలీస్‌ శాఖలో కలకలం రేపుతోంది.

నోట్ల మార్పిడి ముఠాను పట్టుకుని..
విశాఖపట్నం కమిషనరేట్‌ పరిధిలో భారీ మొత్తంలో రూ.2 వేల నోట్ల మార్పిడికి కొందరు రెండు రోజుల క్రితం యత్నించారు. రూ.90 లక్షల విలువైన 500 నోట్లు ఇస్తే రూ.కోటి విలువైన 2 వేల నోట్లు ఇస్తామన్న ఒప్పందంతో డబ్బు చేతులు మారింది. అదేరోజు బీచ్‌రోడ్డులో తనిఖీ చేస్తుండగా ఇద్దరి వద్ద భారీగా నగదు చిక్కింది. తనిఖీల్లో ఉన్న ఒక మహిళా సీఐ నగదంతా రూ.2 వేల నోట్లుగా గుర్తించి ఆరాతీయగా… వారు కమీషన్‌ ప్రాతిపదికన నోట్లు మారుస్తున్నట్లు తేలింది.

నొక్కేసేందుకు స్కెచ్‌..
ఆ నగదుకు ఆధారాల్లేవని తెలిసి.. ఆమె ఆ సొమ్మును నొక్కేద్దామని ప్లాన్‌ వేసింది. కోటి రూపాయల్లో నుంచి రూ.20 తీసుకుంది. ఇది తన కమీషన్‌ అని తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే మొత్తం డబ్బు సీజ్‌ చేస్తామని భయపెట్టింది. ఈ మార్పిడి వ్యవహారంలో నౌకాదళ విశ్రాంత ఉద్యోగుల నగదూ ఉండటంతో వారు లెక్కలున్నాయని ఆమె వద్దకు వెళ్లినట్లు సమాచారం. ఆమె వారిని కూడా సదరు మహిళా సీఐ బెదిరించి పంపేశారు.

సీపీకి ఫిర్యాదుతో..
బాధితులు తమ వద్ద ఉన్న ఆధారాలతో విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. వాస్తవాలపై స్పష్టత రావడంతో ఆమెపై చర్యలు తీసుకొనేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. అయితే ఆమెకు అనుకూలంగా అధికార పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలిసింది.

వేతనం తీసుకుంటూనే..
ఫ్రీగా వస్తే ఫినాయిల్‌ రకాలు కొందరు ఉంటారు. ఇప్పడు మహిళా సీఐ వ్యవహారం కూడా అలాగే ఉంది. తన కళ్ల ముందు రూ.90 లక్షల నోట్లు కనిపించడంతో దుర్బుంధి పుట్టింది. చట్ట వ్యతిరేకంగా తరలిస్తే సీజ్‌ చేసి చట్ట ప్రకారం ^è ర్యలు తీసుకోవాల్సిన సీఐ.. చట్టబద్ధమైందని బాధితులు చెబుతున్నా.. కళ్ల ముందు కనిపిస్తున్న కడక్‌ నోట్లను వదలలేకపోయింది. ఇంకేముంది రూ.20 లక్షల నొక్కేసింది. అయితే బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయరని భావించింది. ఈమేరకు ఓ వార్నింగ్‌ కూడా ఇచ్చింది. కానీ నావీ రిటైర్డ్‌ ఉద్యోగులు కావడంతో సీపీని ఆశ్రయించారు. కి ‘లేడీ’ సీఐ ఆటకు చెక్‌ పెట్టారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular