Nose Shape: సాముద్రికా శాస్త్రం తెలిసిన వారు మనుషుల రూపాన్ని బట్టి వారి గుణగణాలు అంచనా వేస్తుంటారు. మన ఆకారాన్ని బట్టి ఎదుటి వారు మన గురించి అంచనా వేస్తంటారు. మన జాతకం చెప్పేస్తుంటారు. ఆకృతి ఆధారంగా వ్యక్తిత్వాన్ని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో మన శరీరంలోని కళ్లు, ముక్కు, చెవులు మన నడవడికను తెలియజేస్తాయి. మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంలో మన శరీర భాగాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందులో ముక్కును ప్రధానంగా చూస్తారు.
ముక్కు
ముక్కు మన వ్యక్తిత్వం గురించి చెబుతుంది. ఎలాంటి ముక్కు ఉంటే మన గుణం ఎలా ఉంటుందనే దానిపై చెబుతుంటారు. మందంగా ముక్కు ఉంటే త్వరగా ఆలోచనలు చేస్తారు. కొన్ని సమయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న ముక్కు ఉన్న వారు ఉల్లాసంగా ఉంటారు. త్వరగా కోపం తెచ్చుకుంటారు. ఇలాంటి ముక్కుల వల్ల ఈ రకమైన ఫలితాలు వస్తాయి.
చిన్న ముక్కు
చిన్న ముక్కు ఉన్న వారిలో సృజనాత్మకత ఉంటుంది. అందరు వీరిని ప్రేమిస్తారు. వీరి కోపమే వీరిని శత్రువులుగా మారుస్తుంది. విశాలమైన ముక్కు ఉన్న వారు మంచి వ్యక్తిత్వంతో జీవిస్తారు. ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు దక్కుతుంది. చురుకుదనంతో ఉంటారు.
చదునైన ముక్కు
చదునైన ముక్కు ఉన్న వారు ఆశావాదులు. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగుతారు. జాలి, ప్రేమ కలిగి ఉంటారు. పని చేసేందుకు ఎంత కఠినమైన నిర్ణయాలు అయినా తీసుకుంటారు. వీరు శక్తివంతులుగా ఉంటారు. పెద్ద ముక్కు ఉన్న వారు తమ ముద్ర వేయాలని చూస్తుంటారు. పెద్ద ముక్కు ఉన్నవారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటం సహజమే.
కోటేరు ముక్కు
కోటేరు ముక్కు ఉన్న వారు అందంగా ఉంటారు. ఆకట్టుకుంటారు. ఏ పని చేయాలన్నా తొందరపడరు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్తారు. ఇతరుల మీద కామెంట్లు చేయరు. అనవసరంగా గొడవలు పెట్టుకోరు. పనిలో నాణ్యత ఉండేలా చూసుకుంటారు. వీరు అత్యంత శక్తివంతులుగా ఎదుగుతారు. సమగ్ర ఆలోచనలతో ముందుకు వెళ్లి విజయాలు సొంతం చేసుకుంటారు.