Homeఆంధ్రప్రదేశ్‌Panabaka Lakshmi: టిడిపికి కేంద్ర మాజీ మంత్రి గుడ్ బై

Panabaka Lakshmi: టిడిపికి కేంద్ర మాజీ మంత్రి గుడ్ బై

Panabaka Lakshmi: ఎన్నికలు సమీపిస్తున్నాయి. టిక్కెట్లు దక్కని వారు పక్క పార్టీల్లో చేరుతున్నారు. ప్రధానంగా వైసీపీ నుంచి ఇతర పార్టీల్లో చేరికలు జరిగాయి. తాజాగా తెలుగుదేశం పార్టీని సైతం కొంతమంది వీడుతున్నారు. ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ టిడిపికి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు తాజాగా మరో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి టిడిపి నుంచి బయటకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె ఎంపీ సీటును ఆశిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. అటు సర్వేల్లో వెనుక పడడంతో ఈసారి చంద్రబాబు ఆమెకు టికెట్ ఇవ్వరని తెలుస్తోంది. అదే జరిగితే పనబాక లక్ష్మి పూర్వాశ్రమం కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారని సమాచారం.

పనబాక లక్ష్మి కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. ఆ పార్టీ నుంచి నాలుగు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. మూడుసార్లు నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2009లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. పెట్రోలియం, సహజ వాయువు శాఖ, జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు 2004 నుంచి 2009 మధ్య కేంద్ర సహాయ మంత్రిగా కూడా సేవలందించారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున తిరుపతి పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. తిరుపతి ఎంపీ అకాల మృతితో మరోసారి చంద్రబాబు పనబాక లక్ష్మికి అవకాశం ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో సైతం పనబాక లక్ష్మికి ఓటమి తప్పలేదు. కానీ ఈ ఎన్నికల్లో సైతం ఎంపీ సీటును ఆమె ఆశించారు. తిరుపతి కానీ బాపట్ల పార్లమెంట్ స్థానం కానీ కేటాయించాలని కోరారు. అయితే ఆమె సర్వేల్లో వెనుకబడ్డారు. దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో టిడిపిలో ఉండకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ చంద్రబాబు టిక్కెట్ ను నిరాకరిస్తే.. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
Oktelugu Epaper
Exit mobile version