https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ తీసిన సినిమాల్లో రెండు డిజాస్టర్ సినిమాలు ఇవే…

ముఖ్యంగా ఆర్య సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక మొత్తానికైతే ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటూ ముందుకెళ్తున్నాడనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : March 20, 2024 / 04:49 PM IST

    Allu Arjun disaster movies

    Follow us on

    Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్… ఈయన చేసిన సినిమాలు మంచి విజయాలను అనుకున్నాయి. ముఖ్యంగా ఆర్య సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక మొత్తానికైతే ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటూ ముందుకెళ్తున్నాడనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ కెరియర్లో ఒక రెండు భారీ ఫ్లాప్ లు అయితే వచ్చాయి.

    ఇక మొదటిది వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘బద్రీనాథ్’ సినిమా కాగా, మరొకటి వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాతో భారీ డిజాస్టర్లను అందుకున్న అల్లు అర్జున్ క్రేజ్ అయితే భారీగా తగ్గిపోయిందనే చెప్పాలి. ఇక ఇలాంటి సమయం లోనే పుష్ప సినిమాతో తన క్రేజ్ ని అమాంతం పెంచుకున్నాడు. ఇక ఒక్కసారిగా తన స్టార్ డమ్ ను ఇండియా మొత్తం విస్తరించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియాలో టాప్ హీరోగా ఎదగడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఈ సినిమాతో సుకుమార్ తనదైన రీతి లో పాన్ ఇండియా రేంజ్ లో మరోసారి అదరగొట్టబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అటు సుకుమార్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరు ఎవరికివారు స్టార్లుగా ఎదగాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కి ‘నేషనల్ అవార్డు’ రావడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

    తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా తెలియజేశాడనే చెప్పాలి. ఇన్ని సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఒక్క యాక్టర్ కి నేషనల్ అవార్డు రాకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అల్లు అర్జున్ మరొకసారి నేషనల్ అవార్డు ను గెలవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…