IPL 2024: IPL 2024 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా చెన్నై జట్టుతో బెంగళూరు జట్టు తలపడనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. సొంత మైదానంలో ప్రారంభ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బెంగళూరు జట్టు అభిమానుల కోసం అదిరిపోయే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కర్ణాటకలో Mr nags videos తో ఫేమస్ అయిన డానిష్ తో( Danish sait) ప్రత్యేకంగా కనిపించాడు. దీంతో కన్నడ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
బెంగళూరు జట్టు పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. ఆటో స్టాండ్ చేసి ఉంటుంది. దాని టైర్లకు royal, challengers, Bengaluru విడివిడిగా రాసి ఉంటుంది. అయితే ఇది డానిష్ ( Danish sait) కు నచ్చదు. ఆ ఆటో వైపు అలా చూసిన అతడు.. వెంటనే ఆ టైర్లను విప్పుతాడు.. అనంతరం royal, challengers, Bengaluru అని రాసి టైర్లను బిగిస్తాడు. అనంతరం ఇప్పుడు అర్థమైందా అని కన్నడలో అంటూ.. ఆటోను స్టార్ట్ చేస్తాడు.. అలా ముందుకు కదిలిన వెంటనే royal challengers Bengaluru అనే పదాలు టైర్ల మీద వరుసగా కనిపిస్తాయి.. చివర్లో ఆటో వెనుక విరాట్ కోహ్లీ, మాక్స్ వెల్ ఫోటోలు గ్రాఫిక్ రూపం లో కనిపిస్తాయి. ఈ వీడియో ఆసక్తికరంగా ఉండటంతో కన్నడ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈసాలా కప్ నమ్దే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు..
సొంత మైదానంలో తొలి మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బెంగళూరు ఎలాగైనా విజయం సాధించాలని కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కీలక ఆటగాళ్లు అభిమానుల సమక్షంలో కసరత్తు మొదలుపెట్టారు. విరాట్ కోహ్లీ, మాక్స్ వెల్ వంటి వారు అభిమానులను ఉత్సాహపరిచారు. చేతులు ఊపుతూ పలకరించారు. ఈ వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను ఇప్పటికే లక్షల్లో అభిమానులు చూశారు. సోషల్ మీడియాలో ఇది తెగ చక్కర్లు కొడుతోంది.
ಇವಾಗ ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥ ಆಯ್ತು @DanishSait! We thank you wholeheartedly for taking part in this special video. ❤
ನಿಮ್ಮ ಮಿಸ್ಟರ್ ನಗ್ಸ್ ವೀಡಿಯೋಸ್ ಮಾತ್ರ ಅಲ್ಲ, ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ಚಿತ್ರಗಳು ಸೂಪರ್ ಹಿಟ್ ಆಗಲಿ ಅಂತ ಹಾರೈಸ್ತಿವಿ. #PlayBold #ನಮ್ಮRCB #DanishSait #RCBUnbox pic.twitter.com/jISQcsBf4D
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 20, 2024