Erasu Pratap Reddy : మామిడిపండ్ల సీజన్ ప్రారంభం అయ్యింది. నోరూరించే మామిడి పండ్లు మార్కెట్లో దర్శనం ఇస్తున్నాయి. కర్నూలు జిల్లా( Kurnool district) మామిడి పండ్లకు ప్రసిద్ధి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సైతం మామిడి పండ్లు ఎక్కువగా పండుతాయి. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఏపీ రైతులు సైతం విదేశీ రకాల మామిడి నెత్తి సాగు చేస్తున్నారు. అయితే మన మామిడి పండ్లతో పోల్చితే జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన చాలా రకాల మామిడి పండ్లకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. ముఖ్యంగా మియాజాకీ అనే రకానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే మన రైతులు సైతం ఆ రకం మామిడి సాగుకు ఇష్టపడుతున్నారు. ఈ మామిడి కిలో లక్షలు పలుకుతోంది. గతంలో బంగ్లాదేశ్లో కిలో లక్ష రూపాయల వరకు పలికింది. ఈ మామిడి పండ్లలో ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటికి విపరీతమైన గిరాకీ.
Also Read : వైసిపి మాజీ ఎంపీ ఆస్తుల వేలం!
* మియా జాకీ.
ఈ అరుదైన మియా జాకీ మామిడి రకాన్ని పండిస్తున్నారు ఏపీకి చెందిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి( Pratap Reddy). తన వ్యవసాయ క్షేత్రంలో వీటిని నాటించారు. బంగ్లాదేశ్ నుంచి ఈ మొక్కలను తెప్పించి సాగు చేశారు. ప్రతాప్ రెడ్డి పాణ్యం లో తన పొలాన్ని ఒక ప్రయోగ క్షేత్రంగా మార్చారు. తన పొలంలో విభిన్న రకాల మామిడి మొక్కలను పెంచుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 20 రకాలుకు చెందిన 1500 మామిడి మొక్కలను బంగ్లాదేశ్ నుంచి తెప్పించారు. అయితే ప్రస్తుతం వాటిలో 400 మొక్కలు పెరిగాయి. ప్రతాప్ రెడ్డి నిత్యం వాటిని పర్యవేక్షిస్తుంటారు. ఆయన పొలంలో అరటిపండుల తొక్క తీసి తినే బనానా మ్యాంగో ని కూడా పండిస్తున్నారు. రెడ్ ఐవరీ రకం మామిడికాయ కేజీనర బరువు ఉంటుంది. దాని టెంక మాత్రం 30 గ్రాముల మాత్రమే ఉంటుంది. అటువంటి అరుదైన రకాన్ని సైతం సాగు చేస్తున్నారు.
* అరుదైన రకాలు
మరోవైపు ప్రతాప్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో టామీ అప్కిన్స్ రకం మామిడి కూడా సాగవుతోంది. ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపయోగపడుతుంది. మరోవైపు ఎక్కువగా తీయగా ఉండే హనీ డ్యూ మామిడి రక్తాన్ని కూడా సాగు చేస్తున్నారు. అమెరికన్ పాలిమర్, సెన్సేషన్ మామిడిపండ్ల రకాలను కూడా పెంచుతున్నారు. రెండేళ్లలో ఎనిమిది అడుగుల ఎత్తు మాత్రమే పెరిగి ఎక్కువ కాయలు కాసే నాన్ డాక్ రకం మామిడిని కూడా ఆయన సాగు చేస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారులు ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తున్నారు. ప్రస్తుతం విదేశీ మామిడి మొక్కలతో ప్రతాప్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం కళకళలాడుతోంది.
* సీనియర్ రాజకీయ నేత..
ఏరాసు ప్రతాప్ రెడ్డి సీనియర్ పొలిటిషియన్( senior politician). కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ.. అంతగా యాక్టివ్ గా లేరు. రెండేళ్ల కిందట బంగ్లాదేశ్ లో జరిగిన మామిడి మేళాలో ఆరు మియాజాకీ రకం మొక్కలను కొనుగోలు చేసి తన పొలంలో వేశారు. అయితే ఇప్పుడు ఆ మొక్క కాయలను కాచింది. అయితే ఈ పండ్లు సంపన్నులు ఎక్కువగా తింటారు. పోషకాహారంగా ఎక్కువగా వినియోగిస్తారు. అయితే మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం చూస్తే మాత్రం.. ఆయనకు సాగు అంటే ఎంత ఆసక్తి అన్నది తెలియజేస్తోంది.