EX MP Butta Renuka : వైయస్సార్ కాంగ్రెస్ మాజీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ( Butta Renuka)బిగ్ షాక్. ఆమె ఆస్తులను వేలం వేసేందుకు రంగం సిద్ధం అయ్యింది. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఆమెపై చర్యలకు దిగింది. ఎల్ఐసి అనుబంధ విభాగమైన ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి రేణుక, ఆమె భర్త నీలకంఠం రూ.310 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అయితే ఈ లోన్ తిరిగి చెల్లించకపోవడంతో వారి ఆస్తులను వేలం వేసేందుకు ఎల్ఐసి సిద్ధమయింది. ఇప్పటికే రెండుసార్లు వేలం వేశారు. ఇప్పుడు మూడోసారి కూడా వేలం వెయ్యబోతుండడం పై సర్వత్ర చర్చకు దారితీస్తోంది. ప్రజాప్రతినిధిగా ఉన్న ఆమె పేరు ఇటువంటి ఘటనల్లో తరచూ వినిపిస్తుండడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
Also Read : శ్రీకాకుళం జిల్లా చంద్రబాబు.. ఎన్నికల హామీకి శ్రీకారం!
* వ్యాపార రంగంలో ఉండడంతో..
బుట్టా రేణుక ఫ్యామిలీ వ్యాపార రంగంలో ఉంది. బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్, మెరీడియన్ ఎడ్యుటెక్ సర్వీసెస్ సంస్థలను నడుపుతోంది ఆ ఫ్యామిలీ. ఈ తరుణంలో ఎల్ఐసి( Life Insurance Corporation of India) నుంచి 310 కోట్ల రూపాయల రుణం తీసుకుంది సదరు కుటుంబం. 2018లో 15 ఏళ్ల కాల పరిమితికి గాను ఈ రుణం పొందారు. ఐదేళ్ల వరకు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించారు. మొత్తం 40 కోట్ల వరకు తిరిగి చెల్లింపులు చేశారు. అటు తరువాత నుంచి చెల్లింపులు నిలిపివేశారు. అసలు వడ్డీతో పాటు 340 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అయితే వడ్డీ భారం ఎక్కువగా ఉండడంతో కొన్ని ఆస్తులు విక్రయించి రుణం రీ షెడ్యూల్ చేయాలని ఎల్ఐసి అధికారులు కోరారు.
* నిలిచిన వాయిదా చెల్లింపులు..
గత కొన్నేళ్లుగా నెలసరి వాయిదాల చెల్లింపు కూడా నిలిచిపోయింది. దీంతో ఎల్ఐసి కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్లో ఉండగా.. లోన్ నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని 5 వేల గజాల స్థలాన్ని 145 కోట్ల రూపాయలకు వేలం వేశారు. కానీ ఎవరు ముందుకు వచ్చి వేలంలో పాల్గొనలేదు. మాదాపూర్ లోని 7205 చదరపు గజాల్లో ఉన్న బుట్టా కన్వెన్షన్ కూడా వేలం వేగా అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో అధికారులు మరోసారి ఆస్తులు వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
* గత కొద్ది రోజులుగా సైలెంట్..
2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు బుట్టా రేణుక. కానీ గెలిచిన కొద్ది రోజుల తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. అయితే 2019 ఎన్నికలకు ముందు మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కలేదు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో సైతం ఆమె పోటీ చేయలేదు. ప్రస్తుతం పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆమె ఆస్తులను ఎల్ఐసి వేలం వేయడానికి ముందుకు రావడం విశేషం.
Also Read : పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో వర్మని అవమానించిన పోలీసులు..వీడియో వైరల్!