Prabhas : గత కొద్ది రోజుల కింది వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో బాలీవుడ్ హీరోల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఇక ఇప్పుడు మాత్రం తెలుగు సినిమా హీరోల హవా ఎక్కువగా అయిపోయింది. ఇక ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో వచ్చిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట రాబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…డిఫరెంట్ కథలతో వచ్చి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి మనవాళ్ళు కీలక పాత్ర వహిస్తూ ముందుకు సాగుతున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న కొంతమంది హీరోలలో ప్రభాస్(Prabhas)ఒకరు… ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు భారీ విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ కూడా క్రియేట్ చేసి పెట్టాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి దక్కిన క్రేజ్ మరే హీరో కి దక్కడం లేదు. బాహుబలి (Bahubali 2) సినిమాతో 1800 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలు అడపదడప సక్సెస్ లను సాధించినప్పటికి సలార్(Salaa), (Kalki) సినిమాలతో పెను ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటి వరకు ఆయన అందుకున్న విజయాలు ఒకెత్తయితే, ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ (Fouji) సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తున్నారట. 4000 మందితో ఒక వార్ సీన్ ను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయా..?
అందులో ప్రభాస్ కీలకమైన ఆపరేషన్ ని సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తారట. మరి ఆ ఆపరేషన్ ఏంటి ప్రభాస్ అందులో భారీ ఎలివేషన్స్ లో కనిపిస్తాడు. ప్రభాస్ ని చూసిన ప్రతి ఒక్కరు విజిల్స్ వేస్తారంటూ దర్శకుడు చెప్పిన మాటలు ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి జోష్ ను నింపుపుతున్నాయి…
మరి ప్రభాస్ ఇలాంటి క్యారెక్టర్ ని ఇప్పటివరకైతే చేయలేదు. కాబట్టి ఇది తనకు కచ్చితంగా కొత్తగా ఉంటుందని తన అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి వాళ్ళందరూ అనుకున్నట్టే ప్రభాస్ ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ చేసి నెంబర్ వన్ హీరో గా మరోసారి ప్రూవ్ చేసుకుంటాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని చాలా గొప్ప ప్లేస్ లో నిలిపాయనే చెప్పాలి. కాబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలను డామినేట్ చేసే కెపాబిలిటీ ఉన్న ఒకే ఒక కటౌట్ ప్రభాస్ మాత్రమే…అతను సినిమాలకు బాలీవుడ్ లో విపరీతమైన ఆదరణ అయితే దక్కుతుంది.
Also Read : ప్రభాస్ తో సూపర్ మ్యాన్ సినిమా చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసిన సుకుమార్…