Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే చాప మంది నటులు సైతం ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. రీసెంట్ గా పుష్ప 2 (Pushpa 2) సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఆయన ఇక మీదట చేయబోయే సినిమాలతో తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే అట్లీ ఈ సినిమాకు సంబంధించిన బాండెడ్ స్క్రిప్ట్ ను రెడీ చేశారు. అయితే ఇందులోను మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అయితే బాగుంటుందని తను భావిస్తున్నాడట.
Also Read : అల్లు అర్జున్, అట్లీ సినిమాలో హీరోయిన్ ఆమేనా..? ఫ్యాన్స్ ఏమైపోతారో!
ఇంతకుముందు సీతారామం (Seetha ramam), హాయ్ నాన్న (Hai Nanna) లాంటి సినిమాలతో మంచి విజయాలను సాధించాలనే ప్రణాళికలను రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన మృణాల్ నటిస్తే మాత్రం తను స్టార్ హీరోయిన్ గా మారుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి ఈమె చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఇక మీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.ఇక మృణాల్ ఠాకూర్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ అల్లు అర్జున్ తో సినిమా చేస్తే మాత్రం ఆమె ఇండియాలోనే టాప్ హీరోయిన్ గా మారిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
గత కొంతకాలం క్రితం నుంచి ఆమె గ్లామర్ రోల్స్ చేయనని మడికట్టుకు కూర్చోవడంతో ఆమెకు వచ్చిన అవకాశాలన్నీ చేయిజారిపోయాయని ఇకమీదట నుంచి తను ఎలాంటి పాత్రనైనా చేస్తానని గత కొన్ని రోజుల క్రితం రియలైజ్ అవుతూ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. మరి ఈ సినిమాలో తను ఎలాంటి పాత్రలో కనిపించబోతుంది. తద్వారా తను గ్లామర్ షో కూడా చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ మూవీ రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : అల్లు అర్జున్ అట్లీ మూవీ ఓపెనింగ్ డేట్ వచ్చేసిందిగా..?