Election Strategists – Jagan : ఎన్నడూ లేని విధంగా ఏపీకి చిలక జోష్యుల తాకిడి ఎక్కువైంది. ఉత్తరాధిలో పేరు మోసిన జోష్యులు తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. ఇక్కడి రాజకీయాలపై జోష్యాలు చెప్పేస్తున్నారు. మొన్నటికి మొన్న కర్నాటక రాజకీయాలపై జోష్యాలు చెప్పి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు ఏపీపై ఫోకస్ పెట్టడం కాస్తా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏపీకి పనిగట్టుకొని దిగుతున్న చిలక జోష్యులు వచ్చే ఎన్నికల్లో జగన్ కే మద్దతు తెలుపుతున్నారు. సర్వేలకు రివర్స్ గా చెబుతున్నారు. ఈ విషయంపై ఆరాతీస్తే.. వారి వెనుక ఉన్నది ఐ ప్యాక్ టీమ్ అని తెలుస్తుండడంతో నివ్వెరపోతున్నారు.
గత ఎన్నికల ముందు ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐ ప్యాక్ టీమ్ జగన్ స్ట్రాటజీస్టుగా కుదిరింది. సమాజంలో విభజన రేఖ తెచ్చి మరీ జగన్ వైపు టర్న్ అయ్యేలా గట్టిగానే పనిచేసింది. కులం, మతం, వర్గాలుగా ప్రజలను విడగొట్టి మరీ తమ రాజకీయ వ్యూహ చతురతను ప్రదర్శించింది. అయితే ఈసారి జగన్ సర్కారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. దీంతో ఎలా అధిగమించాలో తెలియక ఐ ప్యాక్ మల్లగుల్లాలు పడుతోంది. దీంతో చిలక జోస్యాలపై వైపు మొగ్గుతున్నారు.
ప్రజల దృష్టిని మరల్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఐ ప్యాక్ వ్యూహకర్తలు. ఏపీలో జగన్ కు అనుకూల వాతవారణం ఉందని చెప్పుకునేందుకు విచిత్రమైన ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో పేరుమోసిన చిలక జోస్యం చెప్పే అస్ట్రాలజర్లను పట్టుకుని వారితో ట్వీట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుస్తారని వారు ట్వీట్లు పెడుతున్నారు. అవే ట్విట్లను వైసీపీ సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది.
ఇందులో కొత్త విషయం ఏమిటంటే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని జోక్యం చెప్పిన ఓ అస్ట్రాలజర్ తోనూ ట్వీట్ చేయించారు. ఆయన ట్వీట్ ను వైసీపీ నేతలు ప్రచారం చేసుకునేలోపే పాత ట్వీట్ వైరల్ అయింది. తాజాగా హర్యానా కు చెందిన ఓ అస్ట్రాలజర్ తో ట్వీట్ చేయించారు. ఇలా వరుసగా సమయం సందర్భం లేకుండా జగన్ ప్రభుత్వం మళ్లీ వస్తుందని.. జగన్ సీఎం అవుతారని ఎందుకు ట్విట్టర్‌లో జోస్యాలు చెప్పిస్తున్నారో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. అయితే ఉత్తరాది జనం ఈ జోస్యాలను నమ్ముతారేమో కానీ ఏపీలో మాత్రం.. కామెడీగా చూస్తున్నారు. చాలా లైట్ గా తీసుకుంటున్నారు.