https://oktelugu.com/

AP Volunteers: పాపం ఈనాడు, ఆంధ్రజ్యోతి

వాలంటీర్ వ్యవస్థ అతిపెద్ద డోర్ డెలివరీసిస్టం గా మారింది.ప్రజలతో పెనవేసుకుపోయింది.అయితే అయితే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు ఆగిపోయాయో.. దానికి టిడిపియే కారణమని వైసిపి నిందించడం ప్రారంభించింది.

Written By:
  • Dharma
  • , Updated On : April 2, 2024 / 02:37 PM IST

    AP Volunteers

    Follow us on

    AP Volunteers: వాలంటీర్ వ్యవస్థ పై గత నాలుగున్నర సంవత్సరాలుగా విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ సేవలందిస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవలు అందిస్తూ వచ్చారు. ప్రజల ముంగిటకు సేవలు తేవాలన్న ఉద్దేశంతోనే తమ వాలంటీర్ వ్యవస్థ ప్రారంభించినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ అదో సమాంతర వ్యవస్థ అని.. హానికరమైన వ్యవస్థ అంటూ విపక్షాలు ఆరోపించాయి. అంతకుమించి అన్నట్టు ఎల్లో మీడియా పతాక శీర్షిక వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకంగా కథనాలు రాసుకొచ్చింది. కానీ ఇప్పుడు అదే వలంటీర్ వ్యవస్థ సేవలు నిలిచిపోవడం, పింఛన్ల పంపిణీ ప్రక్రియ పై ప్రభావం చూపడంతో.. ఎలా ముందుకెళ్లాలో తెలియక ఆ సెక్షన్ ఆఫ్ మీడియా సతమతమవుతోంది.

    ఓ స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయడం.. దీనికి స్పందిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. కానీ ఇందులో తమకు సంబంధం లేదని టిడిపి చెబుతోంది. అయితే ఫిర్యాదు చేసిన సంస్థలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండడం.. ఆయన టిడిపితో ఉండే సాన్నిహిత్యం అందరికీ తెలిసిన విషయమే. సరే టిడిపి వాలంటీర్లను విధుల నుంచి దూరం చేయడాన్ని కోరుకోలేదు అనుకుంటే.. ఎల్లో మీడియా ఆ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసింది తప్పు అని ఎందుకు చెప్పలేకపోతోంది. వాలంటీర్లను ఎన్నికల విధులనుంచి తొలగించడం అన్నది టిడిపి తో పాటు ఎల్లో మీడియాకు ఇష్టమైన చర్య. అయితే సంక్షేమ పథకాలు అందుకునే లబ్ధిదారుల నుంచి ఎక్కడ ప్రతికూలత వస్తుందోనని.. గతంలో మాదిరిగా వాలంటీర్లను వ్యతిరేకించక.. వారికి తాము అనుకూలమేనని టిడిపి చెబుతోంది. ఎల్లో మీడియా అదే రీతిన కథనాలను ప్రచురిస్తోంది.

    వాలంటీర్ వ్యవస్థ అతిపెద్ద డోర్ డెలివరీసిస్టం గా మారింది.ప్రజలతో పెనవేసుకుపోయింది.అయితే అయితే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు ఆగిపోయాయో.. దానికి టిడిపియే కారణమని వైసిపి నిందించడం ప్రారంభించింది.దీంతో టిడిపి అలర్ట్ అయింది.ఒకవైపు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇంతకంటే మెరుగైన జీవితాన్ని ఇస్తామని చెబుతూ.. మరోవైపు వారి మెడ మీదనే కత్తిని వేలాడదీయడంతో.. ఎల్లో మీడియాకు ఎటూ పాలు పోవడం లేదు. అటు టిడిపి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అధికారంలోకి వస్తే నాలుగువేల రూపాయలకు పింఛన్ మొత్తాన్ని పెంచడంతో పాటు.. ఇంటి వద్ద అందిస్తామని చెప్పుకోవడం ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు టిడిపి బృందాన్ని పంపించి.. పింఛన్ల పంపిణీని వేగవంతం చేయాలని కోరారు. అయితే ఈ విషయంలో ఎల్లో మీడియా రోజుకో రీతిలో కథనాలు ప్రచురిస్తుండడం విశేషం. గత నాలుగున్నర సంవత్సరాలుగా విషం చిమ్మిన వాలంటీర్ల వ్యవస్థకు మద్దతుగా కథనాలు రాయాల్సి రావడం.. ఈనాడు, ఆంధ్రజ్యోతికి మింగుడు పడని విషయం.