Bigg Boss Telugu 8: 6వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు ఓజీ క్లాన్ నుండి యష్మీ, పృథ్వీ, సీత, విష్ణు ప్రియ నామినేట్ అవ్వగా, రాయల్ క్లాన్ నుండి గంగవ్వ, మెహబూబ్ నామినేట్ అయ్యారు. వీరిలో గంగవ్వ కి ఓటింగ్ ఎవ్వరి ఊహలకు అందని విధంగా ఉంది. సీజన్ 4 లో ఉన్నప్పుడు కూడా ఆమె డామినేషన్ ఈ స్థాయిలోనే ఉండేది. కానీ మధ్యలో తనకు బిగ్ బాస్ హౌస్ వాతావరణం నచ్చడం లేదని, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని నాగార్జున కి చెప్పి వెళ్ళిపోయింది. అయితే ఈ సీజన్ లో మాత్రం గంగవ్వ కుర్ర కంటెస్టెంట్స్ కంటే ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. టాస్కులు కూడా వాళ్ళతో సమానంగా ఆడడం, అందరితో బాగా కలిసిపోవడం వంటివి చేస్తుంది. గంగవ్వ ఏమి చేయకపోయినా ఓట్లు వేస్తారు, ఎందుకంటే ఆమె వయస్సులో చాలా పెద్ద కాబట్టి, సానుభూతి జనాల్లో సాధనరాణంగానే ఉంటుంది కాబట్టి, అలాంటిది ఇంత ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి అందిస్తే ఓట్లు వేయకుండా ఎలా ఉంటారు?, అందుకే ఆమెకు ఆ స్థాయిలో ఓటింగ్ పడుతుంది.
అయితే ఈ సీజన్ టాప్ ఓటింగ్ పడుతున్న కంటెస్టెంట్స్ నిఖిల్, నబీల్ నామినేషన్స్ లోకి లేకపోవడం కూడా గంగవ్వకు కలిసొచ్చే అంశం. వాళ్ళు నామినేషన్స్ లో లేనందున వాళ్లకు పడే ఓట్లు గంగవ్వ కి పడిందని విశ్లేషకులు అంటున్న మాట. కచ్చితంగా ఆ అవకాశం లేకుండా పోలేదు. నిఖిల్, నబీల్ కూడా నామినేషన్స్ లోకి వచ్చి, గంగవ్వ కూడా నామినేషన్స్ లో ఉన్నప్పుడు ఆమె అసలు స్టామినా ఏమిటో తెలుస్తుంది. ఇక ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లో అత్యధిక ఓటింగ్ లో రెండవ స్థానం లో ఉన్నది మెహబూబ్. ఇతను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవ్వడంతో పాటు సీజన్ 4 ఫ్యాన్ బేస్ ఉంటుంది అలాగే సోహెల్ ఫ్యాన్స్ కూడా ఇతనికే ఓట్లు వేస్తారు కాబట్టి ఆ మాత్రం ఓటింగ్ ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఇక అత్యధిక ఓటింగ్ తో మూడవ స్థానం లో కొనసాగుతున్న కంటెస్టెంట్ యష్మీ. ఈమె మణికంఠ కి నెగటివ్ కాబట్టి, మణికంఠ ఫ్యాన్స్ ఈమెని బయటకి పంపేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ ఆ అమ్మాయికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఆమె చాలా బోల్డ్ గా ఆడుతుంది, మనసుకి అనిపించింది చేస్తుంది, ఇలా చేస్తే నెగటివ్ అవుతాను కదా కెమెరాలు చూస్తున్నాయి అనే స్పృహ లేదు, టాస్కులు వచ్చినప్పుడు తన నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది, బోలెడంత కంటెంట్ కూడా ఇస్తుంది, అందుకే ఆమెకి ఆ స్థాయి ఓటింగ్ పడుతుంది. ఇక ఒకప్పుడు టాప్ ఓటింగ్ తో దూసుకుపోయిన విష్ణు ప్రియ, ఈ వీకెండ్ తన గ్రాఫ్ ని మరింత దిగజార్చుకొని నాల్గవ స్థానానికి పడిపోయింది. ఇలాగే ఆడితే ఆమె రాబోయే వారాల్లో ఎలిమినేట్ కూడా అవ్వొచ్చు. ఇక పృథ్వీ గ్రాఫ్ ఎప్పటి లాగానే ఉంది, ఎలాంటి ఎదుగుదల లేదు, ప్రస్తుతం ఆయన 5 వ స్థానంలో ఉన్నాడు. ఇక అందరికంటే భారీ ఓట్ల తేడాతో చివరి స్థానం లో ఉంది సీత. ఈ వారం ఈమెనే ఎలిమినేట్ అవ్వడానికి అత్యధిక అవకాశాలు ఉన్నాయి.