Subbirami Reddy : ఏపీలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ టి.సుబ్బిరామిరెడ్డి. కాంగ్రెస్ నాయకుడిగా, ఆధ్యాత్మికవేత్తగా, సినీ నిర్మాతగా మల్టీ టాలెంటెడ్ పర్సన్. కళాబంధుగా సుపరిచితం. ఆయన ముంబాయిలో పార్టీ ఇస్తే హజరుకాని సినీ సెలబ్రిటీ ఉండరు. అడుగడుగునా వైభోగమే. శివభక్తుడిగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా గ్రాండ్ సక్సెస్. విశాఖ గెస్ట్ హౌస్ కి వెళితే ఇసుకేస్తే రాలనంత జనం. ఎలక్షన్ క్యాంపెయిన్ కు దిగితే జనజాతరే. అంతలా ఉంటుంది ఆయన మేనియా. కానీ ఇదంతా గతం. ఒడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అన్న చందంగా ఆయనకు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయని ప్రచారం జరుగుతుండడం విచారకరం.
రాజకీయ, సినీ రంగాలతో పాటు పారిశ్రామిక రంగాల్లో సైతం రాణించిన వ్యక్తి సుబ్బిరామిరెడ్డి. ఏడు పదుల వయసులో ఫిట్ గా కనిపిస్తారు. నిత్యం శివపూజ చేస్తారు. తెలుగు భాషపై అనర్గళమైన పట్టు. అన్నింటికీ మించి సేవా గుణం ఆయన సొంతం. అర్ధరాత్ర అయినా.. అపరాత్రి అయినా తలుపుతట్టిన నిర్మాతలకు ఉత్త చేతులతో పంపించారని ఇప్పటికీ టాలీవుడ్ లో ఒక టాక్ నడుస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, మోహన్ బాబులాంటి టాలీవుడ్ ప్రముఖులు అత్యంత ఆప్తులు. కోట్లాది రూపాయలు ట్రాన్జెంక్షన్ చేసిన సుబ్బిరామిరెడ్డి ఐదు, పది లక్షలకు ఇబ్బంది పడుతున్నారన్న గ్యాసిప్ ఆయన అభిమానులకు కలవరపాటుకు గురిచేస్తోంది.
సుబ్బిరామిరెడ్డికి ఎన్నో విలువైన ఆస్తులున్నాయి. కానీ అవన్నీ సీజ్ లో ఉన్నాయి. ఆయన సంస్థలు బ్యాంకులకు బకాయి పడడం, వాటి కోసం ఆస్తులు అన్నీ సీజ్ చేయడం, దివాలా పిటిషన్ వంటి కార్యక్రమాలేవో జరుగుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన పరిస్థితులు ఎమంతా ఆశాజనకంగా లేదన్న వార్తలు తెలుగునాట వ్యాపిస్తున్నాయి.
ఆయన దురదృష్టం కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. లేకుంటే నేరుగా సోనియా గాంధీతో మాట్లాడే చనువు ఆయన సొంతం. ఒకప్పుడు తనతో పాటు కుటుంబసభ్యులు ఓ వెలుగు వెలిగిన వారే. సోదరుడు కుమారులు డెక్కన్ క్రానికల్ అధినేతలు. ఇలానే పైకిలేచి కిందకు పడిపోయారు. ఇప్పుడు అదే స్థితిలో కళాబంధు ఉన్నారని తెలుస్తుండడం ఆక్ష్న అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వింటున్నది ప్రచారంగా మిగిలాలని భగవంతుడ్ని వేడుకుంటున్నారు.