spot_img
Homeఎంటర్టైన్మెంట్Prabhas : కామిక్ కామ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా ప్రభాస్... రాయల్ లుక్ వైరల్!

Prabhas : కామిక్ కామ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా ప్రభాస్… రాయల్ లుక్ వైరల్!

Prabhas : హీరో ప్రభాస్ కీర్తి అంతకంతకు పెరుగుతోంది. ఆయన హీరోగా తెరకెక్కిన ప్రాజెక్ట్ కే చిత్రానికి శాన్ డియాగో కామిక్ కామ్ ఈవెంట్లో పాల్గొనే అవకాశం దక్కింది. కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాతినిధ్యం వహించిన మొదటి ఇండియన్ మూవీగా ప్రాజెక్ట్ కే రికార్డులకు ఎక్కింది. జులై 20న మొదలైన కామిక్ కామ్ ఈవెంట్ 23 వరకు జరగనుంది. ప్రాజెక్ట్ కే మూవీ తరపున కామిక్ కామ్ ఈవెంట్లో ప్రభాస్, కమల్ హాసన్, నిర్మాత అశ్వినీ దత్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. 

ఈ అంతర్జాతీయ సినిమా వేడుకలో ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బ్లూ కలర్ సూట్ ధరించి రాయల్ లుక్ లో మెరిశారు. ప్రభాస్ లుక్ వైరల్ అవుతుంది. ఫోటోగ్రాఫర్స్ ఆయన్ని కెమెరాల్లో బంధించారు. కామిక్ కాన్ వేదికపై ప్రాజెక్ట్ కే టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. నేడు అమెరికాలో టైటిల్ టీజర్ విడుదల కానుంది. భారత కాలమానం ప్రకారం జులై 21న ఇండియాలో టీజర్ అందుబాటులోకి రానుంది. 
ప్రాజెక్ట్ కే టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ సూపర్ హీరో మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ ప్రభాస్ పాత్రపై క్యూరియాసిటీ పెంచేసింది. ఇక ప్రాజెక్ట్ కే టైటిల్ ఇదే అంటూ పలు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ప్రముఖంగా కాల చక్ర అనే టైటిల్ ప్రచారం అవుతుంది. దీనిపై మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది. 
ప్రాజెక్ట్ కే సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న విడుదల కానుంది. ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనె నటిస్తుంది. కమల్ హాసన్ కీలక రోల్ చేస్తున్నారు. ఆల్రెడీ అమితాబ్ ఓ పాత్ర పాత్ర చేస్తున్నారు. దిశా పటాని సైతం భాగమయ్యారు. దర్శకుడు నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు.  
Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version