Homeఆంధ్రప్రదేశ్‌NV Ramana save RRR: రఘురామకృష్ణరాజును కాపాడింది జస్టిస్ ఎన్వీ రమణ నా?

NV Ramana save RRR: రఘురామకృష్ణరాజును కాపాడింది జస్టిస్ ఎన్వీ రమణ నా?

NV Ramana save RRR: జస్టిస్ ఎన్వి రమణ( justice NV Ramana ) ఇటీవల వార్తల్లో నిలిచారు. ఓ ప్రైవేటు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా తనను గత ప్రభుత్వం వేధించిందని.. తన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసిందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో జరిగిన పరిణామాలను ఉదహరిస్తూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎన్వి రమణ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే అమరావతి రాజధాని రైతుల న్యాయ పోరాటాన్ని ఉదాహరిస్తూ ఎన్వి రమణ మాట్లాడారు. మధ్యలో రఘురామకృష్ణంరాజు ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఇదే అంశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు రఘురామకృష్ణం రాజు. నాడు జరిగిన ఘటనలను గుర్తు చేసుకున్నారు. తనకు పరోక్షంగా న్యాయపరంగా అందిన సహకారాన్ని సైతం ప్రస్తావించారు.

ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా..
జస్టిస్ ఎన్వి రమణ ది ఏపీనే. అమరావతి( Amaravathi capital) ప్రాంతానికి చెందిన వ్యక్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయనకు అరుదైన అవకాశం వచ్చింది. అయితే ఆ సమయంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ప్రతికూల తీర్పులు వచ్చేవి. అయితే జస్టిస్ ఎన్వి రమణను అడ్డం పెట్టుకొని ఏపీ హైకోర్టును మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలను అప్పట్లో చేశారు. దానిపైనే అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆ విషయంపై సాక్షిలో సైతం పతాక శీర్షికన కథనం వచ్చింది. అయితే దీనిపై నిజనిర్ధారణ చేసిన సుప్రీంకోర్టు అదంతా తప్పని తేల్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ నియామకం జరిగింది. అయితే అదే లేఖలో అమరావతి రాజధాని ప్రాంతంలో ఎన్వి రమణ కుటుంబ సభ్యులు అక్రమంగా భూములు కొనుగోలు చేశారని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అప్పట్లో వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ జస్టిస్ ఎన్వి రమణ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడడం మాత్రం హాట్ టాపిక్ అయింది.

జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలేశారు?
అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ( Supreme court chief justice)అయ్యారు జస్టిస్ ఎన్వి రమణ. అప్పటికే జగన్మోహన్ రెడ్డి పై అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. ఇది ఇబ్బందులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారని జస్టిస్ ఎన్వి రమణను సోషల్ మీడియా వేదికగా అనేకమంది ప్రశ్నిస్తున్నారు. కానీ జస్టిస్ ఎన్వి రమణ గతంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారే తప్ప ఏ ప్రభుత్వం పైన.. ఏ నేతపైన విమర్శ చేయలేదు. ఒక్క మాట నిజం ఆయన ఈ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఆయన నియామకం సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి ఏ రకమైన పరిస్థితులు ఎదురయ్యాయో తెలుసు. అందుకే తన 16 నెలల పదవీ కాలాన్ని బాధ్యతతో వ్యవహరించారు ఎన్వి రమణ. అటువంటి వ్యక్తిపై సోషల్ మీడియా వేదికగా ఇటువంటి ప్రశ్నలు రావడం దురదృష్టకర చర్యగా అభివర్ణించారు రఘురామకృష్ణంరాజు.

ఫుల్ క్లారిటీ..
ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో రఘురామకృష్ణంరాజు( raghurama Krishnam Raju ) ఇదే అంశంపై మాట్లాడారు. నాడు అమరావతిలో జస్టిస్ ఎన్వి రమణ కుటుంబ సభ్యుల భూముల కొనుగోలుకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. జస్టిస్ ఎన్వి రమణ స్వగ్రామానికి దగ్గరలో కుటుంబ సభ్యులు న్యాయబద్ధంగా భూములు కొనుగోలు చేశారని చెప్పుకొచ్చారు. తనకు నేరుగా న్యాయ సహాయం ఎన్.వి.రమణ చేయలేదని.. తాను సాయం అడగలేదని కూడా చెప్పారు. కనీసం బెయిల్ రాని విధంగా తనపై దేశద్రోహం కేసు నమోదు చేశారని.. దారుణంగా కొట్టారని.. మీడియాలో తెలుసుకున్న జస్టిస్ ఎన్వి రమణ.. తాను వేసుకున్న పిటిషన్ను కోర్టులో విచారణ జరపమని మాత్రమే ఆదేశాలు ఇచ్చారని.. అది కూడా నిబంధనల మేరకు మాత్రమే చేశారని నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు రఘురామకృష్ణం రాజు. న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న ఎన్వి రమణ పై సోషల్ మీడియా వేదికగా అటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరంగా అభివర్ణించారు. నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ జగన్ ఏ విధంగా పరిపాలన చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తుంది అని వ్యాఖ్యానించారు. మొత్తానికైతే నాటి సంగతులపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు రఘురామకృష్ణంరాజు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular