YS Jagan – Sharmila : జగన్ తల్లిని మోసం చేశాడా? షర్మిల వ్యాఖ్యల దుమారం

సమైక్యాంధ్ర ఉద్యమం, బైబై బాబు క్యాంపైన్, తెలంగాణలో పాదయాత్ర వంటి సమయంలో తన అవసరాన్ని తీర్చుకోలేదా అని జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. తల్లిని న్యాయం చేయలేని వాడు ప్రజలకు ఏం చేస్తాడని షర్మిల ఘాటుగానే స్పందించారు. ఇప్పుడు ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Written By: NARESH, Updated On : May 10, 2024 10:19 pm

Did Jagan cheat his mother? Sharmila's comments are rubbish

Follow us on

YS Jagan – Sharmila : జగన్ తల్లిని మోసం చేశాడా? ప్రజా ప్రతినిధిని చేస్తానని చెప్పి మాట తప్పాడా? షర్మిల ఇప్పుడు సంచలన విషయాలు బయట పెట్టారు. టీవీ9 ఇంటర్వ్యూలో షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై షర్మిల స్పందించారు. ఎంపీని చేస్తానని అమ్మకి ఇచ్చిన మాటనే జగన్ నిలబెట్టుకోలేదు. ఆయన విలువలు, విశ్వసనీత గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని సంచలన విషయం బయటపెట్టారు. జగన్ మానసిక పరిస్థితిపై కూడా తనకు అనేక రకాల అనుమానాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.

వైయస్ విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఆమె పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అటు తరువాత ఆమె వైసీపీలో ఎటువంటి పదవి చేపట్టలేదు. ముఖ్యంగా జగన్ జైలులో ఉన్నప్పుడు విజయమ్మ షర్మిల తో కలిసి పార్టీని కాపాడగలిగారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. 2014 ఎన్నికల్లోవిశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ బిజెపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 63 అసెంబ్లీ స్థానాలు, ఏడు పార్లమెంట్ సీట్లలో గెలుపొందారు. అటు తరువాత రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపికి అవకాశం వచ్చింది. కానీ ఎన్నడు విజయమ్మ పేరును పరిగణలోకి తీసుకోలేదు.

2019 ఎన్నికల్లో చాలామందికి రాజకీయ జీవితం ప్రసాదించారు. కొత్త కొత్త నేతలకు టిక్కెట్లు ఇచ్చి ప్రోత్సహించారు. కానీ తన తల్లి ముందు ఎన్నికల్లో ఓడిపోయిందని.. వైసీపీ ఆవిర్భావం నుంచి పని చేస్తోందని.. తనకు అండగా నిలిచింది అన్న విషయాన్ని జగన్ మరిచిపోయారు. గత ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు జగన్. ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ సీట్లలో కూడా వైసీపీకి ప్రాతినిధ్యం పెరిగింది. కానీ ఎన్నడూ విజయమ్మ పేరును పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు అదే విషయాన్ని షర్మిల గుర్తు చేస్తున్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో షర్మిల చిచ్చు పెట్టారని జగన్ తాజాగా ఆరోపించారు. టీవీ9 ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. దీనికి కౌంటర్ ఇస్తూ షర్మిల మాట్లాడారు. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరు అని ప్రశ్నించారు. జగన్ అరెస్ట్ సమయంలో, 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయమని అడిగింది మీరు కాదా అంటూ నిలదీశారు. సమైక్యాంధ్ర ఉద్యమం, బైబై బాబు క్యాంపైన్, తెలంగాణలో పాదయాత్ర వంటి సమయంలో తన అవసరాన్ని తీర్చుకోలేదా అని జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. తల్లిని న్యాయం చేయలేని వాడు ప్రజలకు ఏం చేస్తాడని షర్మిల ఘాటుగానే స్పందించారు. ఇప్పుడు ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.