https://oktelugu.com/

Pallavi Prashanth : బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి బంపర్ ఛాన్స్… ఐదు నెలల తర్వాత లక్షల బహుమతి చేతికి!

సదరు గోల్డ్ నెక్లెస్ అమ్మకు తాను ఇచ్చే గిఫ్ట్ అని పల్లవి ప్రశాంత్ చెప్పకనే చెప్పాడు. తనకు ఇంత విలువైన బహుమతి దక్కడానికి కారణమైన స్టార్ మా, బిగ్ బాస్ టీం కి థాంక్స్ చెప్పాడు.

Written By:
  • NARESH
  • , Updated On : May 10, 2024 / 10:22 PM IST

    Pallavi Prashanth

    Follow us on

    Pallavi Prashanth : సోషల్ మీడియాలో సందడి మొత్తం పల్లవి ప్రశాంత్ దే. రైతుబిడ్డ ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నాడు. టైటిల్ గెలిచిన ఐదు నెలలకు విలువైన బహుమతి పట్టేశాడు పల్లవి ప్రశాంత్. ఈ క్రమంలో తన సంతోషాన్ని వెల్లడిస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. దీంతో నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. సెలెబ్రెటీలను సైతం వెనక్కి నెట్టి టైటిల్ సొంతం చేసుకున్నాడు.

    టైటిల్ విన్నర్ గా ప్రైజ్ మనీ రూ. 35 లక్షలు తో పాటు మారుతీ సుజుకి బ్రీజా కార్, బంగారు నెక్లెస్ గెలుచుకున్నాడు. ఫినాలే రోజు స్టేజ్ పైన విన్నర్ కి బహుమతులు ఇస్తారు. కానీ .. వాస్తవంగా అవి వాళ్ళ చేతికి వచ్చేసరికి ఎంత సమయం పడుతుందో చెప్పలేము. టాక్స్ కటింగ్స్ పోను గెలుచుకున్న డబ్బులో సగం కూడా రావని మాజీ విన్నర్స్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

    క్యాష్ ప్రైజ్ తో పాటు స్పాన్సర్స్ అందించే గిఫ్టులు విన్నర్ కి అందాలంటే కొంత సమయం పడుతుంది. కాగా విన్నర్ కి ఇస్తామన్న జాస్ అలుకాస్ డైమండ్ నెక్లెస్ ఎట్టకేలకు ప్రశాంత్ చేతికి వచ్చింది. దీంతో ప్రశాంత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక అమ్మకు తొలి కానుక అంటూ పల్లవి ప్రశాంత్ ఇంస్టాగ్రామ్ లో కామెంట్ చేశాడు. అతని సంతోషానికి హద్దులు లేవు.

    సదరు గోల్డ్ నెక్లెస్ అమ్మకు తాను ఇచ్చే గిఫ్ట్ అని పల్లవి ప్రశాంత్ చెప్పకనే చెప్పాడు. తనకు ఇంత విలువైన బహుమతి దక్కడానికి కారణమైన స్టార్ మా, బిగ్ బాస్ టీం కి థాంక్స్ చెప్పాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ చేసిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న ప్రైజ్ మనీ పేద రైతులకు పూర్తిగా పంచలేదు.