Pawan Kalyan: చెప్పులు వేసుకొని దీక్ష.. పవన్ అపచారం?

పవన్ లో జాతీయ భావం ఎక్కువ. ఆధ్యాత్మిక భావాలు సైతం ఎక్కువగా కనిపిస్తాయి. పూజలు, యాగాలు కూడా ఎక్కువగా చేస్తారు. గతంలోనే ఆయన వారాహిదీక్ష చేపట్టారు. ఇప్పుడు మరోసారి చేపడుతున్నారు.

Written By: Dharma, Updated On : June 26, 2024 5:53 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వారాహి దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 26 నుంచి 11 రోజులపాటు ఆయన దీక్షలో కొనసాగునున్నారు. పాలనలో ఎటువంటి వైఫల్యాలు కలగకుండా చూడాలని కోరుతూ వారాహి దీక్ష చేపడుతున్నట్లు జనసేన వర్గాలు చెప్పుకొచ్చాయి. ప్రస్తుతం పవన్ వారాహి అమ్మవారి దీక్షకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ పద్ధతిగా నుదుటగా బొట్టు, పసుపు రంగు అమ్మవారి బట్టల్లో కనిపించి అందర్నీ మెప్పించారు. అయితే ఆయన అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకున్నారు. అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ చెప్పులు ధరించడం విభాగంగా మారింది. ఇది విపక్షాలకు ఒక అస్త్రం గా మారింది. హిందువులను కించపరచడమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పవన్ లో జాతీయ భావం ఎక్కువ. ఆధ్యాత్మిక భావాలు సైతం ఎక్కువగా కనిపిస్తాయి. పూజలు, యాగాలు కూడా ఎక్కువగా చేస్తారు. గతంలోనే ఆయన వారాహిదీక్ష చేపట్టారు. ఇప్పుడు మరోసారి చేపడుతున్నారు. కానీ దీక్షలో ఉన్న వ్యక్తి చెప్పులు ధరించకూడదన్న నిబంధనను మరిచిపోయారు. ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు. ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా రెచ్చిపోతోంది. ఎన్నికల సమయంలో హిందూ మతం గురించి గొప్పగా చెప్పిన పవన్.. చెప్పులు వేసుకుని దీక్ష చేయకూడదనే విషయం కూడా తెలియకపోవడం ఆయన అవివేకానికి నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పవన్ పై ఇటువంటి విమర్శలే వచ్చాయి. ఎన్నికల ముందు అభిమాని ఇచ్చిన వెంకటేశ్వర స్వామి ఫోటోలు చెప్పులు వేసుకునే అందుకున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

పవన్ పై మితిమీరిన స్థాయిలో కామెంట్స్ చేసే నటి శ్రీరెడ్డి కూడా స్పందించారు. పవన్ చెప్పులతో అమ్మవారి దీక్ష చేస్తున్న ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..’ బిజెపిని మెప్పించడానికా? చెప్పులతో దీక్షలు.. వాట్ ఏ హిందూ ఫాలోవర్’ అంటూ రెండు పగలబడి నవ్వే బొమ్మలను శ్రీరెడ్డి జోడించింది. కాగా అత్యంత నిష్ట, పరిమిత ఆహారం తీసుకుని పవన్ ఈ దీక్ష కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 11 రోజుల పాటు కేవలం పాలు, పండ్లు, ద్రవ ఆహారం మాత్రమే పవన్ తీసుకుంటారు. అయితే ఇంత నిష్టతో చేపట్టిన దీక్షలో.. పవన్ చెప్పులు ధరించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.