https://oktelugu.com/

Anand Mahindra: అన్నీ వదిలేసి అక్కడకెళ్లిపోతానంటున్న ఆనంద్ మహేంద్ర.. వీడియో వైరల్

ఆనంద్ పోస్ట్ చేసిన వీడియోలో.. ఓ యువతి కారు వేసుకొని వచ్చింది. ఓవైపు విస్తారంగా వర్షం కురుస్తోంది. ఈలోపు ఆ యువతి ఆ వర్షంలోనే ఆ కారును నిలిపింది. అందులో ఒక టెంట్ ను బయటికి తీసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 26, 2024 / 06:02 PM IST

    Anand Mahindra

    Follow us on

    Anand Mahindra: ఆనంద్ మహీంద్రా.. భారతీయ కార్పొరేట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. మహీంద్రా ట్రాక్టర్స్, మహీంద్రా ఏరోస్పేస్ , టెక్ మహీంద్రా, మహీంద్రా యూనివర్సిటీ.. ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని.. ఎన్నో కంపెనీలున్నాయి. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యం, వేలాదిమంది ఉద్యోగులు.. పలు దేశాలలో కంపెనీలు ఉన్నప్పటికీ.. ఊపిరి సలపని పని ఒత్తిడి ఉన్నప్పటికీ.. ఆనంద్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్ ఎక్స్ ద్వారా ఆసక్తికరమైన విషయాలను నెటిజన్లతో ఎప్పటికప్పుడు పంచుకుంటారు. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

    ఆనంద్ పోస్ట్ చేసిన వీడియోలో.. ఓ యువతి కారు వేసుకొని వచ్చింది. ఓవైపు విస్తారంగా వర్షం కురుస్తోంది. ఈలోపు ఆ యువతి ఆ వర్షంలోనే ఆ కారును నిలిపింది. అందులో ఒక టెంట్ ను బయటికి తీసింది.. దానిని ఆ వర్షంలోనే మేకులకు కొట్టి.. కారులో ఉన్న కొన్ని రకాల వస్తువులను దాని కింద భద్రపరిచింది. ఆ తర్వాత కారు డోర్లను తెరిచింది. కారు సీట్లను బెడ్ల లాగా పరిచింది.. ఈలోగా టెంట్ కింద ఏర్పాటుచేసిన వస్తువులను ఒక్కొక్కటిగా బయటకు తీయడం మొదలుపెట్టింది. టెంట్ లోనే షవర్ బాత్ చేసింది. హెయిర్ డ్రయర్ ఆన్ చేసి జుట్టును తుడుచుకుంది. ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేసి వంట చేసింది. ఐస్ క్రీమ్ కూడా తయారుచేసింది. ఆ వేడివేడి వంటను తిన్న తర్వాత, ఐస్ క్రీమ్ లాగించింది. ఆ కారు లో ఉన్న వ్యూ ఓ ఫైవ్ స్టార్ హోటల్ గదిని తలపిస్తోంది..

    ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది..” చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంది. పైకి కారు మాత్రమే కనిపించవచ్చు. కానీ లోపల ఒక విచిత్రమైన లోకం కనిపిస్తోంది.. నాకు అక్కడ ఉండాలని ఉంది. ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ జీవించాలని ఉంది. అన్నీ వదిలేసి అక్కడికి వెళ్లిపోవాలని ఉందని” ఆనంద్ రాస్కొచ్చారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.. “ఇలాంటి సౌకర్యాన్ని మహీంద్రా కంపెనీ ద్వారా అందుబాటులోకి
    తేవచ్చు కదా” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.