https://oktelugu.com/

CM Ramesh vs Ambati : సీఎం రమేష్ వర్సెస్ అంబటి.. లైవ్ లోనే బండ బూతులు

దీంతో దిగువ స్థాయిలో కేడర్ మధ్య అదే పరిస్థితి ఉంది.అయితే తాజాగా ఇద్దరు నేతల డిబేట్ యుద్ధ వాతావరణ నికి దారి తీయడంతో దానిని పూర్తిగా నిలిపివేసినట్లు సదరు చానల్ ప్రకటించాల్సి వచ్చింది.

Written By:
  • NARESH
  • , Updated On : May 16, 2024 9:42 am
    CM Ramesh vs Ambati Rambabu

    CM Ramesh vs Ambati Rambabu

    Follow us on

    CM Ramesh vs Ambati : ఏపీలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించక ముందే ఒకరికొకరు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. క్యాడర్ల మధ్య ఘర్షణ వాతావరణానికి కారణం అవుతున్నారు. ఓ తెలుగు ఛానల్ డిబేట్కు మంత్రి అంబటి రాంబాబు, బిజెపి మాజీ ఎంపీ సీఎం రమేష్ హాజరయ్యారు. డిబేట్ కొనసాగుతుండగా ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.వ్యక్తిగత దూషణలు, హెచ్చరికల వరకు పరిస్థితి మారింది. అసలు చెప్పరాని, వినకూడని భాషలో ఇద్దరు తిట్టుకున్నారు. ఏకంగా లైవ్ లో తీసుకోవడంతో సదరు టీవీ ఛానల్ యాజమాన్యం లైవ్ ను నిలిపివేసినట్లు తెలుస్తోంది.

    సన్నాసి యూజ్లెస్ ఫెలో, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న, జీప్ ఫెలో లాంటి మాటలతో దారుణంగా తిట్టుకున్నారు. నేను తలచుకుంటే నువ్వు ఉన్నచోట నుంచి బయటకు పోలేవు అంటూ సీఎం రమేష్ అంబటిని హెచ్చరించారు. దానికి అంబటి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. నోరు జాగ్రత్త పెట్టుకో అంటూ కౌంటర్ ఇచ్చారు. అందుకే ఇలాంటి వ్యక్తులకు ఉంటారని నేను డిబేట్ కు రానన్నానని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. అంబటి సైతం అదే తీరున రెస్పాండ్ అయ్యారు. తాము లైవ్ డిబేట్లో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి మరి తిట్టుకున్నారు.

    డిబేట్ సానుకూల వాతావరణం లోనే ప్రారంభం అయ్యింది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అని సీఎం రమేష్ చెపుకొచ్చారు. క్యూ లైన్లో బారులు తీరిన మహిళలు కూటమికి మద్దతు పలికారని ఆయన కామెంట్ చేశారు. దానికి రాంబాబు కౌంటర్ ఇస్తూ వైసిపి కే జనాలు జేజేలు పలికారని చెప్పారు. మహిళల కోసం వైసీపీ ఏం చేసిందని సీఎం రమేష్ ప్రశ్నించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశారా అని నిలదీశారు. అయితే డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ఏం చేశారో తెలుసు అంటూ అంబటి ఎద్దేవా చేశారు. అక్కడ నుంచి డిబేట్ పక్కదారి పట్టింది. వ్యక్తిగత దూషణలకు దారితీసింది.

    ఏపీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ రోజున హింస చెలరేగింది. పోలింగ్ ముగిసిన రెండు రోజుల వరకు అదే పరిస్థితి ఉంది. చివరకు 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. కేంద్ర బలగాలను రప్పించాల్సి వచ్చింది. ఇటువంటి సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన నాయకులు సంయమనం కోల్పోతున్నారు. దీంతో దిగువ స్థాయిలో కేడర్ మధ్య అదే పరిస్థితి ఉంది.అయితే తాజాగా ఇద్దరు నేతల డిబేట్ యుద్ధ వాతావరణ నికి దారి తీయడంతో దానిని పూర్తిగా నిలిపివేసినట్లు సదరు చానల్ ప్రకటించాల్సి వచ్చింది.