DUNE : PROPHECY : డూన్ ప్రొఫెసి సిరీస్ ట్రైలర్ చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి…ఇలా ఎలా తీశారు భయ్యా…

ఇక మొత్తానికైతే మన ఇండియన్ నటి అయిన టబు హాలీవుడ్ తెర పైన కనిపించడం అనేది నిజంగా ఒక మంచి విషయం అనే చెప్పాలి. మరి ఈ సిరీస్ తో కనక తను సక్సెస్ అందుకుంటే ఆమెకు మరిన్ని హాలీవుడ్ ఆఫర్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి...

Written By: NARESH, Updated On : May 16, 2024 10:10 am

DUNE : PROPHECY Official Trailer Review

Follow us on

DUNE : PROPHECY : ప్రస్తుతం ఓటిటి లో హాలీవుడ్ సిరీస్ ల హవా కొనసాగుతుంది. ఎంతలా అంటే ప్రతివారం ఏదో ఒక హై బడ్జెట్ తో కూడిన హాలీవుడ్ సిరీస్ వచ్చి అత్యధికమైన వ్యూయర్ షిప్ ని సొంతం చేసుకోవడమే కాకుండా భారీ విజయాలను కూడా నమోదు చేసుకుంటున్నాయి.ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు మరొక హాలీవుడ్ వెబ్ సిరీస్ కూడా ఓటిటి లో సందడి చేయడానికి రెడీ అవుతుంది.

ఇక సైన్స్ ఫిక్షన్ జానర్ లో డైరెక్టర్ “డెవిస్ విలిన్యుస్” తెరకెక్కించిన “డూన్ ప్రొఫెసి” అనే సిరీస్ తొందర్లోనే స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఈ ట్రైలర్ చూడడానికి చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా విజువల్స్ అయితే టాప్ నాచ్ లో ఉన్నాయనే చెప్పాలి… ప్రతి షాట్ కూడా చాలా ఫ్రెష్ గా మనం ఏ హాలీవుడ్ చిత్రాల్లో చూడని విధంగా కనిపించడం అనేది ఈ సిరీస్ కి చాలా ప్లస్ అవ్వబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక అధికారాన్ని దక్కించుకోవడమే టార్గెట్ గా పెట్టుకుని ఈ సినిమాలోని పాత్రలు కదులుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సిరీస్ లో మన ఇండియన్ నటి అయిన ‘టబు ‘ కూడా ‘సిస్టర్ ఫ్రాన్సిస్కా’ అనే క్యారెక్టర్ లో నటిస్తుంది.

ఇక దానికి తగ్గట్టుగానే ఆమె క్యారెక్టర్ ను ఈ ట్రైలర్ లో చిన్న షాట్ లో ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ అది సరిగ్గా కన్వే అయితే అవ్వలేదు. అయితే ఆమె పాత్ర సిరీస్ కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆమె క్యారెక్టర్ ను ట్రైలర్ లో సరిగ్గా రిలీజ్ చేయకుండా ఆపేసారని కొందరు అంటుంటే, మరి కొంతమంది మాత్రం ఆమె చేసిన పాత్ర చాలా చిన్నదిగా ఉన్నట్టుంది అందువల్లే ఆమెకి ట్రైలర్ లో స్పేస్ ఇవ్వలేదు అని ఇంకొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మొత్తానికైతే మన ఇండియన్ నటి అయిన టబు హాలీవుడ్ తెర పైన కనిపించడం అనేది నిజంగా ఒక మంచి విషయం అనే చెప్పాలి. మరి ఈ సిరీస్ తో కనక తను సక్సెస్ అందుకుంటే ఆమెకు మరిన్ని హాలీవుడ్ ఆఫర్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి…

Tags