CM Jagan : విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం.. గెలిపిస్తారా మరి?

అన్ని అంశాలను ప్రక్షళాన చేశామని అన్నారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజల కోసం వ్యస్థను మార్చడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

Written By: NARESH, Updated On : May 8, 2024 9:35 pm

YS Jagan

Follow us on

CM Jagan : సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈమేరకు అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఏపీలో పార్లమెంటు ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మే 11న ప్రచారానికి తెరపడనుంది. మే 13న పోలింగ్‌ జరుగుతుంది. దీంతో అక్కడ అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తండగా ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలో దిగాయి. ఇరుపక్షాల మధ్యే ఫైట్‌ జరుగుతోంది. మరోమారు అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత, సీఎం జగన్‌ అన్నీ తానై ప్రచారం చేస్తున్నారు. ఇక కూటమి తరఫున చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌తోపాటు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తదితరులు ప్రచారం చేస్తున్నారు. మూడు పార్టీల కూటమిని ఒంటరిగా ఢీకొంటున్నాడు జగన్‌. సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయన్న ధీమాతో ఉన్నారు.

సిద్ధం అంటూ..
పోటీకి సిద్ధం అనే నినాదంతో జగన్‌ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు సభలు నిర్వహించారు. దాదాపు 70 నియోజకవర్గాలు కవర్‌ అయ్యేలా ఈ సభలు నిర్వహించారు. తర్వాత మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్ర చేశారు. ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 2 వేల కిలోమీటర్లమేర బస్సుయాత్ర సాగింది. సిద్ధం సభలతోపాటు, మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కూడా మంచి స్పందన వచ్చింది. బస్సు యాత్ర ముగియగానే మళ్లీ సభలపై దృష్టిపెట్టారు. సిద్ధం సభలు, బస్సు యాత్ర కవర్‌ చేయని నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యలో మేనిఫెస్టో కూడా రిలీజ్‌ చేశారు.

టీవీ9కు ఇంటర్వ్యూ…
ఇక ఇప్పుడు ప్రచార వ్యూహంలో భాగంగా జగన్‌ టీవీ9కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రజినీకాంత్‌ అడిగిన ప్రశ్నలకు జగన్‌ సమాధానం చెప్పారు. ఒకరకంగా ప్రభుత్వ పనితీరుపై ప్రచారం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవబోతున్నామని, ఈసారి విశాఖపట్నంలోనే తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. కొత్త ప్రభుత్వ పాలన విశాఖ నుంచే సాగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ అతిపెద్ద సిటీ అని, విశాఖలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏపీలో మరెక్కడా లేవని తెలిపారు.

అభివృద్ధి గురించి..
ఏపీలో సంక్షేమం మాత్రమే ఉంది.. అభివృద్ధి లేదని విపక్షాలు చేస్తున్న ప్రచారంపై జగన్‌ స్పందించారు. పచ్చకామెర్లు ఉంటే లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరుగుతున్నా చంద్రబాబు కళ్లుండి చూడలేకపోతున్నారని విమర్శించారు. ఎంత అభివృద్ధి జరిగినా వారికి కనిపించదని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి చేశామని చెప్పారు. తమ పాలనలో లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. పారిశ్రామిర వేత్తలు సైతం ఏపీకి క్యూ కడుతున్నారని తెలిపారు.

కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు..
ఇక ఏపీలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు కడుతున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. కొత్తగా నాలుగు సీ పోర్టులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. 10 ఫిషింగ్‌ హార్బర్లు కడుతున్నట్లు చెప్పారు. మూడు ఇండస్ట్రీ్టయల్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

గ్రామ పంచాయతీ వ్యవస్థలో మార్పు..
రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక గ్రామపంచాయతీ వ్యవస్థను మార్చామని జగన్‌ తెలిపారు. పంచాయతీ పరిధిలో ఉన్న భూరికార్డులన్నీ పంచాయతీలో ఉంచామన్నారు. ఎక్కడికో వెళ్లకుండా గ్రామ పంచాయతీలోనే చెక్‌ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు. రైతుల భూములకు సంబంధించి హక్కులు వారికే కల్పించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.

ల్యాండ్‌ టైటిలింగ్‌పై కావాలనే వివాదం..
ఇక ఏపీలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన అంశం ల్యాండ్‌ టైటిలింగ్‌. దీనిపై చంద్రబాబునాయుడు కావాలనే వివాదం సృష్టిసున్నారని ఆరోపించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ అంటే ప్రజల భూములపై వారికి హక్కులు కల్పించడమేనని పేర్కొన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ తీసుకువచ్చిన తర్వాత వారి భూములు ఎవరికైనా అమ్మవచ్చు.. క్రయ విక్రయాలు చేయవచ్చని వివరించారు. 58 నెలల్లో 99 శాతం హామీలు నెరవేర్చామని తెలిపారు.

అప్పుడే తాను ఆనంద పడ్డాను
గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, లంచం ఇస్తే గానీ పని జరగని పరిస్థితి ఎదురైందని, అలాగే విద్యా కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉందని, అందుకే పాలనలో ప్రక్షాళన చేశానని సీఎం జగ¯Œ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక వ్యస్థను తీసుకువచ్చామని, అన్ని అంశాలను ప్రక్షళాన చేశామని అన్నారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజల కోసం వ్యస్థను మార్చడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.