CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu). రెండు ముఖ్య పథకాల విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అందుకు సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తానని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే పింఛన్ల మొత్తాన్ని పెంచి అమలు చేస్తున్నారు. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రధానమైన రెండు పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. వాటి విషయంలో తాజాగా ప్రకటన చేశారు చంద్రబాబు. రైతుల సాగు సాయానికి సంబంధించి అన్నదాత సుఖీభవ, విద్యార్థుల చదువు కోసం తల్లికి వందనం పథకాలను అమలు చేస్తే తేదీలను ప్రకటించారు చంద్రబాబు.
Also Read : మంత్రుల విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం.. తొలగింపు!
* పీఎం కిసాన్ తో కలిపి..
గతంలో జగన్ సర్కార్ వైయస్సార్ రైతు భరోసా( YSR rythu Bharosa ) పేరిట రైతులకు సాయం అందించేది. కేంద్రం అందించే పీఎం కిసాన్ రూ.6000లకు మరో రూ.7500 కలిపి.. రూ.13,500 ఏడాదికి అందించారు. అయితే ఈ మొత్తం రైతుకు ఏ మూలకు చాలదని.. తాను అధికారంలోకి వస్తే రైతులకు 20 వేల రూపాయల చొప్పున అందిస్తారని చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవకు సంబంధించి వెబ్ సైట్ ఓపెన్ చేశారు. దీంతో పథకం అమలుకు శ్రీకారం చుట్టారని అంతా భావించారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. కానీ ఇంతవరకు అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నోచుకోలేదు. దీనిపై ప్రతిపక్షాల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రజల ఎదురుచూపులు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో అన్నదాత సుఖీభవ కోసం రూ. 9400 కోట్లు కేటాయించారు. దీంతో అందరిలో ఆశలు చిగురించాయి. తాజాగా చంద్రబాబు ఇదే విషయంపై ప్రకటన చేశారు.
* వచ్చేనెల అన్నదాత సుఖీభవ..
మే నెల నుంచి అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. పిఎం కిసాన్ నిధి మూడు విడతలుగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదిలో మూడు విడతల్లో 2000 రూపాయలు చొప్పున.. మొత్తం 6000 రూపాయలు అందిస్తోంది కేంద్రం. అన్నదాత సుఖీభవకు సంబంధించి తొలి రెండు విడతల్లో ఐదు వేల రూపాయల చొప్పున… చివరి విడతలు రూ.4000 అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. తద్వారా మొత్తం సాయం 20 వేల రూపాయలు అందనుంది. అయితే తొలి విడతలో మేలో పిఎం కిసాన్ నిధులు జమ కానున్నాయి. దాంతో కలిపి మరో 5 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.
* తల్లుల ఖాతాలోకి నగదు
మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రతి విద్యార్థి తల్లి ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది కూడా మే నెలలో అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తాజాగా ప్రకటించారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి కేటాయింపులు వార్షిక బడ్జెట్లో చేశారు. గతంలో అమ్మ ఒడి పేరిట ఉన్న ఈ పథకానికి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం( Tallikki Vandanam) అని మార్చింది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పింది. ఇది కూడా మే నెలలో చేస్తామని ప్రకటించారు చంద్రబాబు. మొత్తానికైతే కీలకమైన రెండు పథకాలకు సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చింది.
Also Read : అమరావతి గెలిపిస్తుంది.. చంద్రబాబు ప్లాన్ అదే!