CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనాపరమైన నిర్ణయాలతో పాటు ప్రభుత్వపరంగా చిన్నపాటి లోటుపాట్లు కనిపించిన సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రుల విషయంలో కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నారు. సమర్థవంతంగా పనిచేయాలని సూచిస్తున్నారు. ఒక్క మంత్రులే కాదు.. ఆ పేషీలో ఉన్న కీలక అధికారులు, సిబ్బంది వ్యవహార పైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏమాత్రం ఆరోపణలు వచ్చినా వెంటనే దర్యాప్తు చేసి చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
Also Read: మందుబాబులకు షాక్.. రేపు వైన్ షాపులు బంద్!
* కఠిన చర్యలు
తాజాగా మంత్రుల విషయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వంలో ( Alliance government ) పారదర్శకమైన పాలన అందించే క్రమంలో.. మంత్రులు వ్యక్తిగత, పేషీ సిబ్బంది విషయంలో ఏ రకమైన విమర్శలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. కొంతమంది మంత్రుల పేషీలో సిబ్బందిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా హోంమంత్రి వంగలపూడి అనిత సిబ్బంది విషయంలో ఆరోపణలు రావడంతో వెనువెంటనే తొలగించారు. ఆ తరువాత కొంతమంది మంత్రులు ఎలా అయ్యారు. అయితే ఇప్పుడు మరో మంత్రి పేషీలో కీలక అధికారిపై చర్యలు తీసుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది.
* ఓఎస్డీలు, పేషీ సిబ్బందిపై ఫిర్యాదులు
ప్రధానంగా కొంతమంది మంత్రుల ఓఎస్డీలు( minister OSD ), పేషీ సిబ్బందిపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న వారిని కొనసాగించడం పై ఫిర్యాదులు ఉన్నాయి. మరి కొంతమంది కీలక మంత్రుల వద్ద ఉన్న అధికారులు, సిబ్బంది పనితీరుపై ఫిర్యాదులు రావడంతో నివేదికలు కోరారు సీఎం చంద్రబాబు. వాటిని ఆధారంగా చేసుకొని చర్యలకు దిగుతున్నారు. తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర ఓ ఎస్ డి తొలగింపు వ్యవహారం మంత్రుల వద్ద చర్చగా మారింది. ఎక్సైజ్, గనుల శాఖ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర వద్ద ఓఎస్డిగా పనిచేస్తున్నారు రాజబాబు. ఆయనను పక్కన పెట్టింది కూటమి ప్రభుత్వం. వాస్తవానికి రాజబాబు గనుల శాఖ అధికారి. అక్కడ జాయిన్ డైరెక్టర్ గా పని చేస్తూ 2024 మార్చిలో పదవీ విరమణ చేశారు. అయితే ఆయనను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొల్లు రవీంద్ర ఓ ఎస్ డి గా నియమించుకున్నారు. ఆ సమయంలోనే చాలా రకాల విమర్శలు వచ్చాయి. అయితే నాడు మంత్రి కొల్లు రవీంద్ర లెక్క చేయలేదు..
* గత పది నెలలుగా ఆరోపణలు..
అయితే గత పది నెలల కాలంలో రాజాబాబు( Raja Babu) వ్యవహార శైలిపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. అవన్నీ సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లాయి. వీటిపై నివేదికలు తెప్పించుకున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఏకంగా ఓఎస్డినే తప్పించాలని ఆదేశించారు. దీంతో ప్రభుత్వం తనను తప్పించబోతుందన్న వార్త తెలుసుకున్న రాజబాబు తనకు తాను స్వచ్ఛందంగా తప్పుకునేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మంత్రులకు సంబంధించి ఓ ఎస్ డి లు, ఇతరత్రా అధికారులపై బలమైన చర్చ నడుస్తోంది. చాలామంది అధికారుల తీరుపై అభ్యంతరాలు ఉన్నాయి. దీంతో మరిన్ని తొలగింపులు ఉంటాయని తెలుస్తోంది.
Also Read: నేషనల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్.. ఆకట్టుకుంటున్న జనసేన వీడియో!