AP TV Channals : జగన్మోహన్ రెడ్డి భజనను ఆ రెండు చానల్స్ విపరీతంగా చేస్తున్నాయి. ఎంత భరిద్దామనుకున్నా సాధ్యం కావడం లేదని” కూటమి నాయకులు చెబుతున్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కొంతమంది కేబుల్ ఆపరేటర్లు “ఆ చానల్స్” ప్రసారాలను నిలిపివేశారని తెలుస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని భావించి వాటి ప్రసారాలను నిలిపించిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఈ వ్యవహారంలో నాటి టిడిపి పెద్దలు పెద్దగా జోక్యం చేసుకోలేదని సమాచారం. ఆ తర్వాత ఓ ఛానల్ మినహా మిగతావన్నీ లైవ్ లోకి వచ్చేసాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొన్ని చానల్స్ ప్రసారాలను నిలిపివేశారని తెలుస్తోంది. అయితే గతంలో మాదిరి కాకుండా ఈసారి టిడిపి నాయకులు ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది..” ఆ చానల్స్ ఐదు సంవత్సరాలపాటు మా నాయకత్వంపై బురద చెల్లాయి. ఆ చానల్స్ యజమానులపై చర్యలు తీసుకుంటే వారు చేస్తున్న వ్యాపారాలు నేలకు పడిపోతాయి. అయితే అలాంటి ప్రతీకారానికి చంద్రబాబు పూర్తిగా దూరం. అందువల్లే ఆయన సహనాన్ని పాటిస్తున్నారని” టిడిపి నాయకులు అంటున్నారు.. కానీ దీనిని ఆ ఛానల్స్ యజమాన్యాలు అలుసుగా తీసుకుంటున్నాయని టిడిపి నాయకులు చెబుతున్నారు.
అందువల్లేనా..
ఇటీవల ఏపీ రాష్ట్రంలో పలు వివాదాలు చోటుచేసుకున్నాయి. అయితే ఆ రెండు చానల్స్ వైసిపికి అనుకూలంగా వార్తలు ప్రసారం చేశాయి. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శతవిధాలుగా ప్రయత్నం చేశాయి. “నిజాలను దాచి.. ఆ చానల్స్ అబద్దాలను ప్రసారం చేయడం మొదలుపెట్టాయి. తప్పుడు ప్రచారానికే తొలి ప్రాధాన్యం ఇచ్చాయి. భూమన కరుణాకర్ రెడ్డి ఏఆర్ డెయిరీ పేరుమీద దందా చేశారు. దానిపై ఆధారాలు ఉన్నప్పటికీ.. ఆయన రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చారు.. ఆయన చెప్పిన మాటలకే ఆ చానల్స్ ప్రాధాన్యం ఇచ్చాయి..ఇక ఓ చానల్ లో కీలక స్థానంలో ఉన్న వారు మొత్తం టిడిపి వ్యతిరేకులు. వారంతా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడుతుంటారు. గతంలో ఓ చానల్లో పనిచేస్తున్న వ్యక్తి ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వెళ్లారు. ప్రభుత్వం మారడంతో ఆయన మళ్లీ అదే ఛానల్ లోకి వెళ్తున్నారు. దీనిని బట్టి వారు ఎలాంటి ఎజెండా అమలు చేస్తున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్లే ఆ ఛానల్స్ పై కనికరం చూపించాల్సిన అవసరం లేదు. అలాగే చూపిస్తే తీవ్రంగా నష్టపోతామని” టిడిపి నాయకులు అంటున్నారు. అందువల్లే ఏపీ రాష్ట్రంలో వాటికి రెడ్ సిగ్నల్ వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.. అయితే చంద్రబాబు అలాంటి పని చేయరని.. సీనియర్ రాజకీయ నాయకుడిగా.. సీనియర్ ముఖ్యమంత్రిగా అలాంటి పనులు చేస్తే ఆయన ప్రతిష్టకు భంగం కలిగే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..” కేబుల్ ఆపరేటర్లు తమ సమస్యలను అప్పుడప్పుడు తెరపైకి తీసుకొస్తారు. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యతను కొంతమేర చానల్స్ యాజమాన్యాలు భరించాలని కోరతారు. అలా భరించిన యాజమాన్యాల చానల్స్ నే ప్రసారం చేయడానికి ముందుకు వస్తారు. చేయని యాజమాన్యాల చానల్స్ ను ప్రసారం చేయరు. ఆ వ్యవహారాన్ని ప్రభుత్వానికి ముడి పెట్టడం సరికాదని” రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.