Hema Malini Birthday: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ వాళ్ళకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు. అయినప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు అయితే లభించింది. అందులో హేమ మాలిని ఒకరు. ఒకప్పుడు ఆమె అంద చెందాలతో డ్యాన్సులతో ప్రేక్షకులందరి చేత విజిల్స్ వేయించుకునే డ్రీమ్ గర్ల్ గా కూడా ఆమె నటించి మెప్పించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక హేమమాలిని గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో చాలా సినిమాలు చేసి ఎన్నో శిఖరాలను అధిరోహించిన వాళ్ళలో హేమ మాలిని ఒకరు. అమితాబచ్చన్ లాంటి దిగ్గజ నటుడి కి సైతం పోటీ ఇచ్చిన గొప్ప నటి కూడా తనే కావడం విశేషం…ఇక ప్రస్తుతం ఈరోజు ఆమె తన 76 ఏటా అడుగుపెడుతుంది. కాబట్టి ఆమె చేసిన సినిమా గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
1968 వ సంవత్సరంలో మహేష్ కౌల్ దర్శకత్వంలో రాజ్ కపూర్ హీరోగా వచ్చిన ‘సప్ నొకా సద్గర్’ సినిమాతో ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. అప్పటినుంచి వెను తిరిగి చూడకుండా చాలా సినిమాల్లో అవకాశాలను దక్కించుకోవడమే కాకుండా ఆమె తన కంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంది. ముఖ్యంగా ఆమె డ్యాన్స్ లకు ఫిదా కానీ అభిమానులైతే ఉండరు…
ఇక ఈ సినిమా తర్వాత ఆమె ‘సీత ఔర్ గీత’ అనే సినిమాలో సైతం నటించింది. ఇక ఆమె చేసిన సెటిల్డ్ పర్ఫామెన్స్ ఎమోషనల్ గా కూడా చాలా మంది ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. అందువల్లే హేమ మాలిని పేరు బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వినిపించింది…
ఇక వీటి తర్వాత 1975 వ సంవత్సరంలో అమితాబచ్చన్ హీరోగా వచ్చిన ‘షోలే ‘ సినిమాతో మరోసారి ఆమె ఒక అద్భుతాన్ని సృష్టించింది. ఇక ఈ సినిమాలో బసంతి అనే పాత్రలో కనిపించడమే కాకుండా ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా కూడా నటించి మెప్పించింది. ముఖ్యంగా ఆమె అప్పటివరకు చేయని ఒక స్ట్రాంగ్ వైల్డ్ క్యారెక్టర్ ని పోషించి ప్రేక్షకుల మనసును దోచుకుంది…
ఇక వీటితోపాటుగా ‘డ్రీమ్ గర్ల్’ లాంటి సినిమాలో కూడా నటించి మెప్పించింది.
ఇలా ఆమె సినిమా ప్రస్థానం అనేది బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ దిగ్విజయం గా కొనసాగుతూనే ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలో ఆమె అద్భుతమైన నటనను కనబరిచి సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించింది. ఇక ఈ సినిమాలో ఆమె నటన నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి…
ఇక ఇప్పటికి ఈమెకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. అప్పటి తరం నుంచి ఇప్పుడున్న యంగ్ తరం వరకు కూడా ఆమె అంటే తెలియని అభిమానులు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి అలాంటి హేమ మాలిని ఇప్పటికి సినిమాల్లో యాక్టివ్ గా కొనసాగుతూ ఉండడం అనేది ప్రతి సినిమా ప్రేక్షకుడు గర్వపడాల్సిన విషయమనే చెప్పాలి…