Maa Nanna Super Hero: ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్..సుధీర్ బాబు ఇక సినిమాలు మానేయడం బెటర్!

ఇప్పటి వరకు ఈయన 23 సినిమాలు చేస్తే అందులో కేవలం 'ప్రేమ కథా చిత్రం' అనే సినిమా మాత్రమే సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత 'సమ్మోహనం' అనే చిత్రం యావరేజ్ గా ఆడింది. మిగిలిన సినిమాలన్నీ కూడా ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో కూడా అభిమానులకు తెలియదు. అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. పోనీ సుధీర్ బాబు టాలెంట్ లేదా అంటే, ముమ్మాటికీ పప్పులో కాలేసినట్టే.

Written By: Vicky, Updated On : October 16, 2024 1:54 pm

Maa Nanna Superhero

Follow us on

Maa Nanna Super Hero: సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి 12 ఏళ్ళు పూర్తి అయినా కూడా ఇప్పటికీ ప్రేక్షకుల్లో సరైన గుర్తింపుని దక్కించుకోని ఏకైక హీరో ఎవరు అంటే సుధీర్ బాబు అని చెప్పొచ్చు. సూపర్ స్టార్ కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి వచ్చాడు, హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా అవకాశాలు వస్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈయన తనకంటూ ఒక మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. ఇప్పటి వరకు ఈయన 23 సినిమాలు చేస్తే అందులో కేవలం ‘ప్రేమ కథా చిత్రం’ అనే సినిమా మాత్రమే సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘సమ్మోహనం’ అనే చిత్రం యావరేజ్ గా ఆడింది. మిగిలిన సినిమాలన్నీ కూడా ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో కూడా అభిమానులకు తెలియదు. అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. పోనీ సుధీర్ బాబు టాలెంట్ లేదా అంటే, ముమ్మాటికీ పప్పులో కాలేసినట్టే.

ఇతను బాగా నటించడంతో పాటు, డ్యాన్స్ అద్భుతంగా చేయగలడు, ఇక ఫైట్స్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, డూప్ లేకుండా ఎన్నో రిస్కీ స్తంట్స్ ఇది వరకు ఆయన చేస్తూ వచ్చాడు. ఇక స్క్రీన్ ప్రెజెన్స్ విషయం లో కూడా ఇప్పుడున్న యంగ్ హీరోలందరికంటే బెస్ట్ గా ఉంటుంది. పాత్ర కోసం చాలా కష్టపడతాడు, ఇన్ని పాజిటివ్ యాంగిల్స్ ఉన్న ఇతని కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కితే బాగుండును అని ఘట్టమనేని అభిమానులతో పాటు, ఇతర హీరోల అభిమానులకు కూడా అనిపించింది. కానీ సుధీర్ బాబు స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బలహీనంగా ఉండడం వల్ల అభిమానులు కోరుకునే సక్సెస్ రావడం లేదు. రీసెంట్ గానే ఆయన ‘మా నాన్న సూపర్ హీరో’ అనే చిత్రం చేసాడు. విడుదలకు ముందు ఈ సినిమాపై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది, ప్రొమోషన్స్ కూడా అదరగొట్టేసారు. కానీ విడుదల తర్వాత ఈ చిత్రానికి నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. కథ, స్క్రీన్ ప్లే నత్త నడకన సాగిందని, సినిమాలో ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఒక్క సన్నివేశం కూడా లేదని టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఓపెనింగ్స్ నుండే దారుణంగా పడిపోయాయి.

విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకి వచ్చే గ్రాస్ వసూళ్లు కనీసం థియేటర్స్ కి రెంట్ కట్టుకోవడానికి కూడా సరిపోలేదు, ఫలితంగా నెగటివ్ షేర్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి వచ్చిన షేర్ వసూళ్లు అక్షరాలా గుండు ‘సున్నా’. కనీసం కమీషన్ బేసిస్ లో అయినా ఈ సినిమాని నడుపుకుందాం అని భావిస్తే, దసరా పండుగ రోజు కూడా లక్ష రూపాయలకు పైగా గ్రాస్ వచ్చే కెపాసిటీ ఉన్న థియేటర్స్ లో 5 వేల రూపాయిలు వచ్చాయి. అందులో నుండి ఎంత కమీషన్ తీసుకోగలరు చెప్పండి. అందుకే వారం రోజులు కూడా పూర్తి కాకముందే, ఈ సినిమాని థియేటర్స్ నుండి తీసేసారు బయ్యర్స్. సుధీర్ బాబు ఇలాంటి పసలేని సినిమాలు తియ్యడం కంటే, సినిమాలు ఆపేయడం బెటర్ అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.