CM Chandrababu (8)
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ( AP CM Chandrababu)అంది వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు సైతం ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. అటు కేంద్రం సైతం ఏపీకి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ఇప్పటికే దూకుడుగా ఉంది ఏపీ ప్రభుత్వం. కొద్ది నెలల కిందట విశాఖ కేంద్రంగా రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. ఇప్పుడు ఉత్తరాంధ్రలో నేవీకి సంబంధించి యుద్ధ నౌకల కేంద్రంతో పాటు ఆయుధ డిపో ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చింది. ఈ విషయంలో చంద్రబాబు అత్యంత చొరవ తీసుకుంటున్నారు. ఇండియన్ నేవీ కి భూములను కేటాయించి.. ఇక్కడ ఏర్పాటు అయ్యేలా కేంద్రాన్ని ఒప్పిస్తున్నారు.
Also Read: ఏపీ పోలీస్ శాఖకు కొత్త బాస్.. ఆ ముగ్గురిలో ఒకరు!
తూర్పు కోస్తా( east coast) ప్రాంతంగా విశాఖకు గుర్తింపు ఉంది. ఇప్పటికే నేవీ కార్యకలాపాలకు కేంద్రంగా మారింది విశాఖ నగరం. తూర్పు కోస్తా తీర పరిరక్షణకు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది మొదలు.. నావీ సేవలను విస్తృత పరుస్తూ వస్తోంది. అందులో భాగంగా దేశానికి అవసరమైన యుద్ధ నౌకల తయారీ కేంద్రం, ఆయుధ డిపోను ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్థలం అవసరం అని కేంద్రం కోరింది. దానికి భూమిని సమకూర్చే పనిలో పడింది చంద్రబాబు సర్కార్. ఈ రెండు ఏర్పాటు అయితే ఏపీకి జాతీయ పరంగా ప్రత్యేక గుర్తింపు దక్కినట్టే. ఉద్యోగ ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడే అవకాశం ఉంది.
* తూర్పు కోస్తా నావికాదళం విస్తరణ..
ప్రస్తుతం విశాఖ కేంద్రంగా తూర్పు కోస్తా నావికాదళం( East Coast Navi ) కొనసాగుతోంది. దేశంలోనే విస్తృత సేవలు అందిస్తోంది ఈ ప్రాంతీయ కార్యాలయం. ఇప్పుడు మరో ముందడుగు వేసింది. విశాఖకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంబిల్లిలో యుద్ధనౌకల నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది నావికాదళం. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది. దీనిపై శరవేగంగా స్పందించింది చంద్రబాబు సర్కార్. అక్కడ భూముల ఏర్పాటుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాంబిల్లిలో 32 యుద్ధ నౌకలు నిలిపేలా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అనుసంధానంగా కేంద్ర ప్రభుత్వమే ఒక పోర్టు ఏర్పాటు చేయనుంది. అదే జరిగితే భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుందని నావికాదళం అధికారులు చెబుతున్నారు.
* బాడంగిలో ఆయుధ డిపో..
ఇంకోవైపు విజయనగరం జిల్లా బాడంగిలో( Vijayanagaram district badangi ) నావికాదళానికి సంబంధించి ఆయుధ డిపో ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉండేది. కాలక్రమంలో అది కనుమరుగయింది. కానీ ఆ ఎయిర్ క్రాఫ్ట్ భూములు మాత్రం రైతుల ఆధీనంలో ఉన్నాయి. ఒకవైపు అదే జిల్లాలోని భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం.. ఇంకోవైపు రైల్వే మార్గం.. మరోవైపు జాతీయ రహదారులు ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని బాడంగిలో నావికాదళం ఆయుధం డిపో ఏర్పాటుకు దేశస్థాయి అధికారులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే చంద్రబాబు సర్కార్ తీర ప్రాంతాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు వినియోగించుకుంటోంది.
* ఐటీ పరంగా అభివృద్ధి..
ఇప్పటికే విశాఖను పర్యాటకంగా, పారిశ్రామిక హబ్ గా మార్చేందుకు చంద్రబాబు సర్కార్ కృత నిశ్చయంతో ఉంది. ఐటీ( information technology) పరంగా చాలా సంస్థలను ఇక్కడ నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలు అంతర్జాతీయ సంస్థలు సైతం తమ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నాయి. ఒకవైపు పారిశ్రామికం, ఇంకో వైపు ఐటి, మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుతో విశాఖ దేదీప్యమానంగా వెలగనుంది. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల సరసన చేరనుంది.
Also Read: ప్రతిపక్షంలో దీక్షలు.. అన్నేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు కవితక్క?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Cm chandrababu ap coast utilization
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com