Kalvakuntla Kavita
Kalvakuntla Kavita : ప్రతిపక్షంలో దీక్షలు.. అన్నేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు కవితక్క?ఇటీవల కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ వివిధ రకాల ఆందోళనలు చేపట్టారు. రైతుల కోసం సన్నచిలక మిర్చి దండలతో, మహిళల కోసం పోస్ట్‌కార్డ్ ఉద్యమంతో, లేదా హస్తకళాకారుల కోసం ఎండిన పంటలతో ఆమె నిరసనలు దృష్టిని ఆకర్షించాయి. ఈ ఆందోళనలు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలమైందని, రైతులు(Farmars), మహిళలు(Womens), ఇతర వర్గాలను విస్మరిస్తోందని ఆరోపిస్తూ జరిగాయి. తాజాగా ఆమె అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం ఏర్పాటు చేయాలని దీక్ష చేపట్టారు. ఇందిరా పార్కు(Indira Park) ఎదుట మంగలవారం(ఏప్రిల్ 8న) దీక్ష చేపట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే.. నాడు సీఎంగా కేసీఆర్ ధర్నా చౌక్ ఎత్తివేయాలని ఆదేశించారు. విపక్షాలు, కార్మిక సంఘాలు కోర్టుకు వెళ్లి ధర్నా చౌక్ సాధించుకున్నాయి. ఇప్పుడు అదే ధర్నా చౌక్‌లో కవిత ధర్నా చేయడం గమనార్హం. అయితే ధర్నాలు, దీక్షలు ఇప్పుడు చేస్తున్న కవిత.. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తిగా పరిష్కరించలేదన్న ప్రశ్నలకు కారణమవుతోంది.
Also Read : 348.43 కోట్లకు కేసీఆర్ నమస్తే.. ఇందులోనైనా రేవంత్ ఫిక్స్ చేస్తాడా?
పదేళ్లు అధికారంలో..
బీఆర్‌ఎస్ తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉంది. అయినా కవిత(Kavita)ప్రస్తుతం ప్రశ్నిస్తున్న ఒక్క పని కూడా చేయలేదు. అయినా నాడు కవిత ఈ అంశాలపై తండ్రిని, అన్నను ఎప్పుడూ ప్రశ్నించలేదు. సామరస్యంగా అయినా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించలేదు. నాడు అధికారాన్ని అనుభవించి.. ప్రతిపక్షంలోకి రాగానే సమస్యలు గుర్తుకురావడమే ఆశ్చర్యంగా ఉంది.
ఇప్పుడు దీక్షలు ఎందుకు?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కవిత చేస్తున్న ఆందోళనలు, బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా బలోపేతం చేయడానికి, ప్రజల్లో కాంగ్రెస్(Conress)పై అసంతృప్తిని రేకెత్తించడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి. అయితే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు సాధించలేని కొన్ని సమస్యలపై ఇప్పుడు నిరసనలు చేయడం ప్రజల్లో సందేహాలను రేకెత్తిస్తోంది. ఉదాహరణకు, రైతులకు గిట్టుబాటు ధర కోసం ఇప్పుడు ఆందోళన చేస్తున్న కవిత, అధికారంలో ఉన్నప్పుడు ఈ సమస్యను ఎందుకు పూర్తిగా పరిష్కరించలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavita) రాజకీయ జీవితం సాంస్కృతిక, సామాజిక, రాజకీయ కార్యక్రమాలతో నిండి ఉంది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు, కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి పథకాలు రాష్ట్రానికి గుర్తింపు తెచ్చాయి. అయితే, కుటుంబ పాలన, స్థానిక సమస్యల పరిష్కారంలో లోపాలు, యువతకు ఉద్యోగ అవకాశాల కొరత వంటి విమర్శలు కూడా ఎదురయ్యాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ చేస్తున్న ఆందోళనలు రాజకీయ వ్యూహంగా ఉపయోగపడినప్పటికీ, గత పాలనలోని లోటుపాట్లను ప్రజలు గుర్తు చేస్తున్నారు. కవిత ఈ విమర్శలను అధిగమించి, ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ఆమె ఆందోళనలు ఆచరణీయ పరిష్కారాలతో కూడి ఉండాల్సిన అవసరం ఉంది.
Also Read : సన్నబియ్యం ఇచ్చారు.. పేదోడి ఇంట భోజనానికి వెళుతున్నారు..
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Kalvakuntla kavita kalvakuntla kavitha says congress government has failed to implement promises
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com