Homeఆంధ్రప్రదేశ్‌Sajjala Ramakrishna Reddy: సజ్జల ఔట్.. ఆయన స్థానంలో కొత్త నేతకు జగన్ అవకాశం!

Sajjala Ramakrishna Reddy: సజ్జల ఔట్.. ఆయన స్థానంలో కొత్త నేతకు జగన్ అవకాశం!

Sajjala Ramakrishna Reddy: వైయస్సార్ కాంగ్రెస్ లో( YSR Congress ) జగన్మోహన్ రెడ్డి విధేయత కలిగిన నేతలు చాలామంది ఉన్నారు. ఆయన చుట్టూ పార్టీకి స్తంభాల వ్యవహరించే నాయకులు ఉన్నారు. అయితే వారిపై 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. విమర్శలు వ్యక్తమయ్యాయి. వారి పేరు చెప్పి చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే ఆ కీలక నాయకుల్లో ఒకరైన విజయసాయిరెడ్డి సైతం పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేయక ముందు నుంచే ఆయనకు సన్నిహితుడు విజయసాయిరెడ్డి. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఆడిటర్ గా ఉన్న విజయసాయి కాలక్రమంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మిన బంటుగా మారిపోయారు. అటువంటి వ్యక్తి పార్టీ నుంచి బయటకు వెళ్లే క్రమంలో అనేక రకాల ఆరోపణలు చేశారు. కోటరీని మార్చుకోకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. పరోక్షంగా వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ల పై సంచలన ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి.

Also Read: ఏపీ తీరాన్ని కరెక్ట్ గా వాడుకుంటున్న చంద్రబాబు!

* సమూల ప్రక్షాళన..
అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ( Jagat Mohan Reddy )పార్టీలో కీలక నియామకాలు చేపడుతున్నారు. అందులో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతల నుంచి తొలగిస్తుండడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత సజ్జల చుట్టూ వివాదాలు నడిచాయి. చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సజ్జలపై ఆరోపణలు చేశారు. ఆయన తీరుతోనే పార్టీకి నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డికి అవకాశం ఇస్తూనే ఉన్నారు. ఏకంగా ఆయనకు రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకునే బాధ్యతలు అప్పగించారు. ఇటీవల విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో సజ్జలను జగన్మోహన్ రెడ్డి మార్పు చేయడం మాత్రం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డిని సోషల్ మీడియా ఇన్చార్జి పదవి నుంచి తొలగించారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి సైతం రాష్ట్ర సమన్వయకర్త పదవి నుంచి తొలగించారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడినట్లు అయింది.

* సతీష్ రెడ్డికి చాన్స్
మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajal Ramakrishna Reddy )ఖాళీ చేసిన రాష్ట్ర సమన్వయకర్త పదవిని తన సొంత నేతకు అప్పగించుకోవాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. 2024 ఎన్నికలకు ముందు టిడిపి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సతీష్ రెడ్డికి ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చారు. సతీష్ రెడ్డి సుదీర్ఘకాలం వైయస్సార్ కుటుంబం పై పోటీ చేస్తూ వచ్చారు. ముందుగా రాజశేఖరరెడ్డి, తరువాత జగన్మోహన్ రెడ్డి లపై పోటీ చేస్తూ వచ్చిన ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ నిరాకరించారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో బీటెక్ రవికి అవకాశం కల్పించడంతో బయటకు వచ్చేసారు సతీష్ రెడ్డి. అయితే పార్టీ ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పై అభిమానంతో అదే పార్టీలో కొనసాగుతున్నారు. చాలా యాక్టివ్ గా పని చేస్తున్నారు. అందుకే రాష్ట్ర సమన్వయ బాధ్యతలను సతీష్ రెడ్డికి అప్పగించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

* ప్రత్యామ్నాయ పదవి..
అయితే సజ్జల రామకృష్ణారెడ్డికి వేరే బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. కానీ సజ్జలను రాష్ట్ర సమన్వయకర్త బాధ్యతలు నుంచి తొలగిస్తే మాత్రం ఆయన ఇబ్బంది పడక తప్పదు. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు అజ్ఞాతంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసులకు భయపడి దూరంగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇటువంటి సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి సైతం ఆ పదవులను దూరం చేస్తుండడం మాత్రం కొత్త ఆలోచనలు తెరపైకి వస్తున్నాయి. సజ్జలకు పొమ్మనలేక పొగ పెడుతున్నారా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular