జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో సినిమా రంగ సమస్యలను ప్రస్తావిస్తూ పవన్ కల్యాన్ ఏపీ సర్కారుపైనా, మంత్రి పేర్ని నానిపైనా విరుచుకుపడిన విషయం తెలిసందే. దీనిపై పేర్నినాని ఫైర్ అయ్యారు. పవన్ కిరాయి రాజకీయ పార్టీని పెట్టారని ఆరోపించారు. రాజకీయ పార్టీని టెంట్ హౌస్ లా అద్దెకు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆడియో ఫంక్షన్ లో జరిగిన దానిపై మెగాస్టార్ చిరంజీవి తనతో మాట్లాడారని నాని చెప్పారు. ఆడియో ఫక్షన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేసినట్లు తెలిపారు.

ఆడియో ఫక్షన్ లో జరిగిన దానికి ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి చెప్పినట్లు మంత్రి తెలిపారు. చిరు మాటాలతో తాను ఏకీభవించినట్లు చెప్పారు. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ఎప్పటి నుంచో ఉంది. ఇది ప్రభుత్వం కొత్త గా ప్రవేవ పెట్టింది కాదు. సినీ పరిశ్రమ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ కు అనుకూలంగా ఉందని చెప్పారు. తాను జనగ్ పాలేరునేనని.. నువ్వు ఎవరి పాలేరువో చెప్పే దమ్ముందా అంటూ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు.
తాను రెడ్లకు పాలేరునైతే పవన్ కమ్మవాళ్లకు పాలేరు అంటూ పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అవమానించాని చూస్తే అవమానాన్ని పరిచయం చేస్తానని హెచ్చరించారు. ఏపీలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానితో టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, బన్నీవాసు తదితరులు మంగళవారం మచిలీపట్నంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ, ఇతర ఇబ్బందులపై వారు చర్చించారు. అనంతరం పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి నాతో మాట్లాడారని తెలిపారు. సినీ ఫంక్షన్ లో జరిగిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారని నాని పేర్కొన్నారు.