https://oktelugu.com/

CM Chandrababu: సీఎం చంద్రబాబు సింప్లిసిటీ.. మంత్రి లోకేష్ తో చేసిన పనికి ఫిదా!

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హంగు, ఆర్భాటాలు తగ్గాయి. వీలైనంతవరకూ పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు తో పాటు లోకేష్ చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 7, 2024 / 05:27 PM IST

    CM Chandrababu(2)

    Follow us on

    CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి హంగు ఆర్భాటాలు చేయడం లేదు.సభలు, సమావేశాలకు జన సమీకరణ కూడా చేయడం లేదు. జిల్లాల పర్యటనకు వెళ్లి..ఆ ఒక్క గ్రామానికి పరిమితం అవుతున్నారు.కనీసం పక్క గ్రామం నుంచి కూడా జన సమీకరణ చేయడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లాలో దీపం పథకాన్ని ప్రారంభించారు చంద్రబాబు. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆ హామీ మేరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఈదుపురం అనే గ్రామంలో పథకానికి శ్రీకారం చుట్టారు. కేవలం గ్రామస్తుల తోనే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈరోజు అదే మాదిరిగా వ్యవహరించారు చంద్రబాబు. పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ సైతం తండ్రితో పాటు పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడం విశేషం.

    * ఉద్యమంలా సమావేశాలు
    ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించారు. అందులో భాగంగా బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు లోకేష్ హాజరయ్యారు. పాఠశాల ఆవరణను ఇద్దరూ పరిశీలించారు. తరగతి గదులను సందర్శించారు. విద్యా బోధనపై ఆరా తీశారు. వసతులపై సమీక్షించారు. అనంతరం మధ్యాహ్నం పిల్లలతో కలిసి అక్కడే సహపంక్తి భోజనాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    * పరుగులు పెట్టిస్తున్న లోకేష్
    పాఠశాల విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు. గత ఆరు నెలలుగా వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ఆకస్మిక పర్యటనలకు ప్రాధాన్యమిస్తున్నారు. విశాఖ పర్యటనలో ఉండగా శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందారు. నాడు నేడు పనుల్లో భాగంగా వైసీపీ సర్కార్ చేపట్టిన నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించింది. ఈ క్రమంలోనే ఆ విద్యార్థి ప్రమాదానికి గురై మృతి చెందాడు. దీంతో హుటాహుటిన లోకేష్ శ్రీకాకుళం జిల్లాలో ఆకస్మిక పర్యటన చేశారు. కనీసం ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులను కూడా సమాచారం ఇవ్వలేదు. ఆకస్మిక పర్యటనలతో అధికారులను అప్రమత్తం చేశారు. అయితే ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు తో పాటు నేరుగా మంత్రి లోకేష్ పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. తండ్రి కొడుకుల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.