https://oktelugu.com/

Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ కోసం పరితపించిన అధికారులు.. ఏం చేశారంటే?

యాంకర్ అనసూయ అంటే తెలియని వారు ఉండరు ఇప్పుడు. స్టార్ హీరోయిన్ కు సొంతం చేసుకున్నారు ఆమె. ఆమెను చూసేందుకు సాధారణంగా జనం ఎగబడతారు. అయితే మైదకూరు పట్టణంలో మాత్రం జనం మాట దేవుడెరుగు. అధికారులు చేసిన పని మాత్రం వింతగా ఉంది.

Written By:
  • Dharma
  • , Updated On : December 7, 2024 / 05:22 PM IST

    Anasuya Bharadwaj

    Follow us on

    Anasuya Bharadwaj: టాలీవుడ్ స్టార్ యాంకర్ గా గుర్తింపు పొందారు అనసూయ.జబర్దస్త్ లో యాంకర్ గా సుపరిచితమైన ఆమె ఇప్పుడు బుల్లితెరలతో పాటు వెండితెరపై సైతం మెరుస్తున్నారు. తెలుగు నాట ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. రంగస్థలంలో రంగమ్మత్తగా మంచి నటన కనబరిచారు. పుష్ప రెండు వెర్షన్లలో సైతం మంచి పాత్రలను సొంతం చేసుకున్నారు.బుల్లితెరతో పాటు వెండితెరపై ఆమె నటిగా మంచి గుర్తింపు సాధించడంతో అదే స్థాయిలో అభిమానులు కూడా పెరిగారు.స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె హై సెలెబ్రెటీ పర్సన్ గా మారారు. ఈ నేపథ్యంలో ఆమె వైయస్సార్ కడప జిల్లా మైదకూరు వెళ్లారు.కానీ అనసూయ కోసం అధికారులు ఓవరాక్షన్ చేశారు.దీనిపై సామాన్యులు మండిపడుతున్నారు. ఒక వస్త్ర దుకాణం ప్రారంభానికి అనసూయ రావడం స్థానికులకు సమస్యగా మారింది. ట్రాఫిక్ నిలిచిపోయింది. బస్సుల రాకపోకలు సైతం నిలిచిపోవడంతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు.

    * ఏకంగా ఆర్టీసీ ద్వారాలు మూత
    మైదకూరులోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఖాళీ స్థలంలో ఓ ప్రైవేటు కంపెనీ వస్త్ర దుకాణాన్ని ఏర్పాటు చేసింది. శనివారం ఆ దుకాణాన్ని అనసూయ ప్రారంభించారు. అయితే అధికారులు ముందుగానే బస్టాండ్ మెయిన్ ద్వారా మూసేశారు.దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్,టీచర్స్ మీటింగ్ ఈరోజు నిర్వహించారు. ఈ తరుణంలో చాలామంది తల్లిదండ్రులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. కానీ ప్రధాన ద్వారం మూసివేయడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వారు పడిన బాధలు వర్ణనాతీతం. కొందరైతే ఆర్టీసీ అధికారులను నిలదీసినంత పని చేశారు.

    * అధికారుల వింత సమాధానం
    అయితే ప్రజలు నిలదీయడంతో అధికారులు వింత సమాధానాలు చెబుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాము అలా చేయాల్సి వచ్చిందని సమర్థించుకుంటున్నారు.అయితే ఒకయాంకర్ వస్తే ట్రాఫిక్ క్రమబద్ధీకరించలేరా?అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.